కొడాలి విశ్వరూపం ఇదేనా?

Publish Date:Apr 23, 2022

Advertisement

మంత్రి పదవిలో లేకపోతే నా విశ్వరూపం చూపిస్తా’.. కొద్ది రోజుల క్రితం ఈ మాటలన్నది ఎవరో తెలుసా? గుడివాడ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కొడాలి నాని. వైఎస్ జగన్ కేబినెట్ పునర్వ్యస్థీకరణకు కొద్ది రోజుల ముందు నాని ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. ముందుగా అందరూ అనుకున్నట్లుగానే జగన్ రెండో కేబినెట్లో కొడాలికి స్థానం దక్కలేదు. దానికి ఆయన మాట్లాడే బూతులు, చేసిన పనుల వల్లే కేబినెట్ లో కొనసాగింపు లభించలేదంటారు.

మంత్రి పదవి పోయిన కొద్ది రోజులకు కొడాలి నాని ఓ పశువుల పాకలో పడుకుని ఏదో దీర్ఘాలోచన చేస్తున్నట్లు ఉన్న ఫొటో ఒకటి మీడియాలో హల్ చల్ చేసింది. ఆ ఫొటోపై నెట్టింట జోక్ లు పేలాయి. ‘ఇక నీ గతి ఇంతే కొడాలి’ అంటూ, పశువుల్ని కాసుకో అని మరికొందరు నెటిజన్లు సలహా ఇచ్చారు. తాజాగా గుడివాడ నియోజకవర్గం పరిధిలో మట్టి మాఫియా చెలరేగి రెచ్చిపోవడం సర్వత్రా విమర్శలకు తావు ఇచ్చింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపై మైనింగ్ మాఫియా హత్యా యత్నం చేసింది. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అరవింద్ ని జేసీబీతో నెట్టి హత్యాయత్నం చేసింది. అయితే.. జేసీబీ నుంచి పక్కకు తప్పుకుని ఆర్ఐ అరవింద్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. లేకపోతే ఆయన ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోయేవంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుని ఉండేదనే భయాలు వ్యక్తం అయ్యాయి.

కొడాలి నాని సన్నిహితుడు, వైసీపీ నేత గంటా సురేష్ ఆధ్వర్యంలో చాలా రోజులుగా రాత్రి వేళల్లో మట్టి తవ్వకాలు యధేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు చెబుతున్న మాట. రెండు రోజుల క్రితం తాసిల్దార్ ఆదేశాల మేరకు మట్టి మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన ఆర్ఐ అరవింద్ పై సురేష్ సోదరుడు కల్యాణ్ దాడి చేశాడు. జేసీబీతో ఆర్ఐ అరవింద్ ను తొక్కించే యత్నం చేయడం దుమారం లేపింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారుల సంఘం వెంటనే స్పందించింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఇటీవలే గుడివాడ తాసిల్దార్ పై దాడి చేసిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు ఆర్ఐపై హత్యా యత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గుడివాడ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మట్టి మాఫియా దురాగతాలకు ఎమ్మెల్యే కొడాలి నాని ప్రోత్సాహం ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విశ్వరూపం చూపిస్తానన్న కొడాలి నాని మాటల వెనుక ఇలాంటి దారుణాలు చేయడమే ఉద్దేశం కావచ్చా? అంటున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. జూదం, పేకాట, గుండాట, అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై అధికార, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. పైగా ఏపీలో ఏనాడూ కనీ వినీ ఎరుగని గోవా క్యాసినో సంప్రదాయాన్ని గుడివాడకు కొడాలి తీసుకొచ్చారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. క్యాసినోను కొడాలి కల్యాణ మండపంలో నిర్వహించడం, కోట్లాది రూపాయలు చేతులు మారడంపైనా ఆందోళనలు జరిగాయి.

క్యాసినో వ్యవహారంపై నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ కమిటీని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. కొడాలి నాని రాజకీయాల్లోకి రాక ముందు లారీల్లో డీజిల్ చోరీ చేసేవారని, లారీలు ఎత్తుకుపోయి ఈ స్థాయికి వచ్చారంటూ ఆ సమయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న లాంటి వారు దుమ్మెత్తిపోశారు. కొన్నాళ్ల క్రితం గుడివాడలో జరిగిన భూ కబ్జా వ్యవహారంలో కూడా కొడాలి నాని పరోక్ష పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ‘గుడివాడలో గడ్డం గ్యాంగ్ దారుణాలు’ పేరుతో మీడియాలో వార్తా కథనాలు కూడా వచ్చాయి.

ఇలాంటివన్నీ చూస్తే.. కొడాలి నానికి మంత్రి పదవి అడ్డుగా ఉందని, అది కాస్తా లేకపోతే తన విశ్వరూపం చూపిస్తాననడం వెనుక ఇంత అర్థం ఉందా? అని అందరూ విస్తుపోతున్నారు. కొడాలి నాని విశ్వరూప ప్రదర్శనలో తొలి చర్యగానే రెవెన్యూ అధికారిపై హత్యా యత్నం జరగడం కావచ్చని అంటున్నారు. మట్టి మాఫియాతో మొదలైన కొడాలి ఆగడాలు ఇంకా ఎక్కడిదాకా వెళతాయో అనే భయం పలువురు స్థానికల్లో వ్యక్తం అవుతోంది

By
en-us Political News

  
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.