ఏపీకి క్యూ కట్టనున్న దిగ్గజ సంస్థలు.. గెట్ రెడీ.. అధికారులతో చంద్రబాబు

Publish Date:Jan 25, 2025

Advertisement

దావోస్ పర్యటనకు ఆర్భాటంగా వెళ్లి రిక్త హస్తాలతో తిరిగి వచ్చారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు చంద్రబాబు. దావోస్ వేదికగా జరిగి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ఏకైక అజెండాగా వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సదస్సు జరిగినన్ని రోజులూ క్షణం తీరక లేకుండా దిగ్గజ సంస్థల అధిపతులతో చర్చోపచర్చలు జరిపింది. సదస్సు ముగిసిన తరువాత విజయ హాసంతో చంద్రబాబు, ఆయన బృందం తిరిగి వచ్చింది. 

అయితే వైసీపీ నేతలు మాత్రం దావోస్ పర్యటనలో చంద్రబాబు విఫలం, ఒక్క రూపాయి పెట్టుబడి రాష్ట్రానికి తేలేకపోయారంటూ ఇష్టారీతిగా నోరు పారేసుకుంది. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఏడు నెలలో దావోస్ సదస్సుతో సంబంధం లేకుండానే రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వెతుక్కుంటూ వచ్చాయన్న విషయాన్ని వైసీపీ నేతలు కన్వీనియెంట్ గా మరిచిపోయారు. దావోస్ సదస్సులో ఒక్కటంటే ఒక్క ఎంవోయూ కూడా కుదుర్చుకోలేకపోయారంటూ చంద్రబాబు, లోకేష్ మీద ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. వాటన్నిటికీ చంద్రబాబు దీటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం స్విట్జర్లాండ్ నగరం దావోస్ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పర్యటనను ముగించుకుని శుక్రవారం (జనవరి 24) సాయంత్రానికి అమరావతి చేరుకున్నారు.  అదే రోజు తన అధికారిక నివాసంలో   ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  ఈ సందర్బంగా చంద్రబాబు   ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకే తాను దావోస్ వెళ్లానని ఆ పని దిగ్విజయంగా పూర్తి చేశాననీ చెప్పారు.  

ప్రభుత్వం తరఫున తాము ఇచ్చిన ప్రజెంటేషన్లను సావధానంగా విన్న దిగ్గజ సంస్థల అధిపతులు, ప్రతినిధులు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని తెలిపారని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో దిగ్గజ సంస్థల ప్రతినిధి బృందాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. వారు వచ్చినప్పుడు… వారికి అవసరమైన వివరాలను సమగ్రంగా అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పిందే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. దావోస్ లో తాము చేసిన కృషికి కొనసాగింపుగా పకడ్బందీ చర్యలు చేపడితే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తడం ఖాయమేనని, ఆ దిశగా సిద్ధం కావాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.