ఢిల్లీ వన్డే మ్యాచ్: ఇండియా 167 ఆలౌట్
Publish Date:Jan 6, 2013
Advertisement
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పాక్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 167 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్ల దాటికి భారత బ్యాట్స్‌మన్‌లందరూ ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి పెవిలియన్‌కు చేరారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 43.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ ధోనీ 36, రైనా 31, జడేజా 27, యువరాజ్ 23, గంభీర్ 15 పరుగులు చేయగా మిగిలిన వారందరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో అజ్మల్ 5 వికెట్లు పడగొట్టగా, ఇర్ఫాన్ 2, జునైద్, ఉమర్ గుల్, హఫీజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-india-all-out-for-167-36-20248.html
http://www.teluguone.com/news/content/-india-all-out-for-167-36-20248.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





