ఒక్కో యువతికి 30 వేలు ఆశ చూపి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో నయా దందా.!

Publish Date:Oct 31, 2026

Advertisement

గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కలకలం రేపిన ఒక ఘటనలో, పేరుకు లేడీస్ హాస్టల్ ముసుగులో సాగుతున్న భారీ అండాల అక్రమ దందా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతమైన బేగంపేట ప్రకాశ్‌నగర్ పరిధిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బేగంపేట పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అర్థరాత్రి సమయంలో నిర్వహించిన ఈ సోదాల్లో అక్కడ నివసిస్తున్న సుమారు 10 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

ప్రాథమిక విచారణలో పట్టుబడిన వారంతా బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుపేద యువతులుగా గుర్తించారు. గత ఏడాది కాలంగా ప్రకాశ్‌నగర్‌లోని ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరుతో ఈ కార్యకలాపాలు నిరంతరంగా కొనసాగుతున్నట్లు స్థానికులు  పోలీసుల ద్వారా తెలుస్తోంది. పేదరికంలో మగ్గుతున్న యువతులను టార్గెట్ చేస్తూ, వారికి మాయమాటలు చెప్పి ఈ అక్రమ రనాలోకి లాగుతున్నట్లు అధికారులు తేల్చారు. ఒక్కో యువతికి సుమారు రూ. 30,000 వరకు నగదు ఆశ చూపి, వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికి వదిలేసి నిబంధనలకు విరుద్ధంగా హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తూ ఈ దందాను నడిపిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 

కనీస వైద్య సదుపాయాలు లేని సాధారణ అపార్ట్‌మెంట్‌లలో ఇలాంటి సంక్లిష్టమైన వైద్య ప్రక్రియలను నిర్వహించడం పట్ల నిపుణులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ పద్ధతిలో సేకరించిన అండాలను (Eggs), సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు చికిత్స అందించే నగరంలోని ప్రముఖ ఫెర్టిలిటీ (Fertility) కేంద్రాలకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు. కేవలం మహిళల అండాలే కాకుండా, పురుషుల వీర్యకణాలను (Sperm) కూడా అక్రమంగా సేకరించి సరఫరా చేస్తున్నారనే మరో కోణంలోనూ పోలీసులు కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం రాకెట్ వెనుక ఒక మహిళ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి ఆమెను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ దందా వెనుక ఏయే సంతాన సాఫల్య కేంద్రాలకు సంబంధాలున్నాయి, దీని వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో బేగంపేట పోలీసులు తదితర బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి

 

 

 

[  hyderabad egg donation racket, begumpet police raid, illegal fertility scam, sot raid hyderabad, ivf egg trade scandal, girls hostel illegal activities, Hyderabad police, CP Sajjnar, DGP C.V. Anand ]

By
en-us Political News

  
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.