పిల్లలలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే చెడుదారిలో పడ్డారని అర్థం..!
Publish Date:Jul 4, 2025
.webp)
Advertisement
పెద్దలు ఎల్లప్పుడూ స్నేహాలు మంచిగా ఉండాలని సలహా ఇస్తారు. దీని వెనుక వారి ఆలోచన ఏమిటంటే- 'స్నేహం ఎలా ఉంటుందో, ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.' ఎవరైనా సరే ఏ రకమైన వ్యక్తులతో సమయం గడుపుతారో, వారి ఆలోచన, ప్రవర్తన, అలవాట్లు క్రమంగా ఎదుటివారిలో రావడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా పిల్లలలో ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది. ఎందుకంటే వారు ఈ సమయంలో భావోద్వేగపరంగా పెళుసుగా ఉంటారు. ఇతరుల వల్ల సులభంగా ప్రభావితమవుతారు. పిల్లలు తప్పుడు స్నేహంలో పడితే, అది వారి ప్రవర్తన, నమ్మకం, చదువులతో పాటు వారి భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. వారిలో కనిపించే కొన్ని అలవాట్ల కారణంగా వారు చెడుదారిలో పడ్డారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు.
ఉపాధ్యాయుల గురించి చెడుగా మాట్లాడటం..
ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా వారిని తక్కువ అంచనా వేయడం ప్రారంభించినప్పుడు, పిల్లవాడు చెడు సహవాసంలో పడిపోయాడని అర్థం చేసుకోవాలి. ఇది పిల్లలకు చదువు మీద చులకన భావం ఏర్పడేలా చేస్తుంది.
చెడు స్నేహితుల సమర్థింపు..
పిల్లవాడు తన స్నేహితుల్లో ఎవరి తప్పుడు ప్రవర్తననైనా సమర్థించడం ప్రారంభిస్తే , ఆ పిల్లవాడు ఆ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యాడని స్పష్టమైన సంకేతం. ఇది హెచ్చరిక సంకేతం అవుతుందట. ఇలాంటి వారు స్నేహితుల ద్వారా ాలా దెబ్బ తింటారు.
నెగెటివ్ గా మాట్లాడటం..
పిల్లవాడు అకస్మాత్తుగా తన గురించి ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా అతని ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, అది అతని స్నేహితుల యొక్క ప్రతికూల ప్రభావం కావచ్చు. ఇది పిల్లవాడిని ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తుంది.
రహస్యం..
పిల్లవాడు అకస్మాత్తుగా ఫోన్ దాచి స్నేహితులతో మాట్లాడటం, లేదా చాట్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌ను దాచిపెట్టడం వంటివి చేస్తే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా తప్పు పనులు చేసే అవకాశం ఉంటుంది.
చదువుకు దూరం కావడం..
పిల్లలు అకస్మాత్తుగా చదువుకు దూరం కావడం, హోంవర్క్ వాయిదా వేయడం, తరగతులకు హాజరు కాకపోవడానికి సాకులు వెతకడం లేదా అస్సలు చదువుకోకూడదని అనిపించడం ప్రారంభిస్తే, అది సోమరితనం వల్ల మాత్రమే కాకపోవచ్చు. చెడు సహవాసం వల్ల కూడా ఇలా చేసే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/-how-to-find-child-wrong-path-35-201234.html












