మాదాపూర్‌లో విదేశీ మహిళలతో వ్యభిచార దందా గుట్టురట్టు.!

Publish Date:Oct 26, 2026

Advertisement

ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. మాదాపూర్, కూకట్‌పల్లి ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలు పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రూమ్ నంబర్ 204లో సోదాలు.!

మాదాపూర్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో ఉన్న ‘ఓరియన్ ఎలిగెంట్’ సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా రూమ్ నంబర్ 204లో సోదాలు నిర్వహించి ముగ్గురు ఉజ్బెకిస్తాన్ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే వీసా లేవని, నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

ఆ ముగ్గురు మహిళలను విచారించడంతో ఈ వ్యవహారం వెనుక ఢిల్లీకి చెందిన నాయక్ అనే వ్యక్తి ఉన్నట్లుగా వెళ్లడైంది. ఉద్యోగాల పేరుతో ఉజ్బెకిస్తాన్ మహిళలను ఇక్కడికి రప్పించి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న నాయక్‌పై కేసు నమోదు* చేసిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.

అపార్ట్‌మెంట్ల నిర్వాహకులకు పోలీసుల హెచ్చరిక.!

పట్టుబడిన ముగ్గురు మహిళలను న్యాయస్థానంలో హాజరు పరిచిన అనంతరం స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు, సర్వీస్ అపార్ట్‌మెంట్ల నిర్వాహకులు గదులు అద్దెకు ఇచ్చే ముందు కస్టమర్ల గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

 

 

 

[ Gachibowli prostitution racket, Uzbekistan women arrested, Hyderabad crime news, foreign women sex racket, Gachibowli police raid, Dream Pride hotel case ]

By
en-us Political News

  
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.