Forest Bathing- ఆరోగ్యంలో కొత్త సంచలనం!

Publish Date:May 26, 2016

Advertisement

 

అడవి గాలి అన్న మాట మనకి కొత్తేమీ కాదు. కానీ ఆ గాలికి దూరం కావడమే ఓ చిత్రం. మనిషి నాగరికతకి నిదానంగా అలవాటుపడుతున్న కొద్దీ, ప్రకృతికి వీలైనంత దూరంగా జరుగుతున్నాడనడంలో అతిశయోక్తి ఏదీ లేదు. కానీ అలా నాగరిక ప్రపంచంలో మునిగిపోయిన ఉన్న మనిషి ప్రశాంతంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఒత్తిడి- ఒత్తిడి నుంచి రక్తపోటు- రక్తపోటు నుంచి గుండెజబ్బులు... ఇలా నానారకాల వ్యాధులూ అతన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఆ మధ్య ఎప్పుడో అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఆ దేశంలోని జనం 87 శాతం సమయాన్ని నాలుగ్గోడల మధ్యే గడిపేస్తున్నారట. ఇలా నాలుగ్గోడల మధ్య నలిగిపోతున్న మనుషుల కోసం ఇప్పుడు ఓ కొత్త చికిత్సా విధానం ప్రచారంలోకి వస్తోంది. అదే Shinrin-yoku... అంటే జపాను భాషలో అడవీ స్నానం (ఫారెస్ట్‌ బాతింగ్‌) అన్నమాట!

 

Shinrin- Yoku ఎక్కడో ప్రాచీన కాలం నాటి పదం కాదు. అసలు అప్పట్లో ఇలాంటి అవసరమే లేదు కదా! 1980ల్లో జపాను అటవీ శాఖ మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. ఇదే క్రమంగా ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఇలా అడవీ స్నానం చేయాలనుకునే వ్యక్తులను, అందులో నిష్ణాతులైనవారు అడవుల్లోకి తీసుకువెళతారు. కేవలం అడవుల్లోకి అలా నడుస్తూ వెళ్లడమే కాదు... తమ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ, చెట్టూచేమల్ని గమనిస్తూ సాగాలి. నిదానంగా ఊపిరిని పీల్చుకుంటూ, అడవిలో లీనమవుతూ నడవాలి. ఇలా ప్రయాణం సాగిస్తున్నప్పుడు తాము కూడా ఈ అనంతమైన ప్రకృతిలో భాగమే కదా అనిపిస్తుంది మనిషికి. ప్రకృతిలో ఉన్న జీవమే తనలోనూ తొణికిసలాడుతున్నట్లు తోస్తుంది. ఒత్తిడి స్థానంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది.

 

Shinrin- Yoku వల్ల ఒత్తిడి మాయమైపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి తోడు మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుందని తేలింది. ఒత్తిడిని కలిగించే కార్టిజాల్‌, అడ్రినలిన్‌ వంటి హార్మోలన్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడాన్ని కూడా గమనించారు. ఇక అడవిలో Shinrin- Yoku తరహా చికిత్సను తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి కూడా పెరిగినట్లు తేలింది. అందుకని ఇప్పుడు కొరియా మొదలుకొని ఆస్ట్రేలియా వరకూ దేశదేశాలన్నింటిలోనూ Shinrin- Yoku శిబిరాలు వెలుస్తున్నాయి. కానీ మనకు ఇలాంటి చికిత్స గురించి తెలియకుండానే మనం దానిని పాటించేస్తూ ఉన్నాము. ఏ తిరుపతికో, మేడారానికో, శ్రీశైలానికో... వెళ్తే Shinrin- Yoku శిబిరంలో పాల్గొన్నట్లే కదా! అక్కడ ఉండే అడవులూ, జలపాతాలూ, కొండకోనలూ అన్నీ మనలోని ప్రకృతిని తట్టిలేపేవేనయ్యే! కాకపోతే ఈసారి కాస్త మనసు పెట్టి వాటిలో లీనమైతే సరి... మనం కూడా అడవీ స్నానాన్ని ఆచరించినట్లే!

- నిర్జర.

By
en-us Political News

  
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.