ఫెయిల్డ్ సీఎం జగన్.. హామీల అమల్లో అట్టర్ ఫ్లాఫ్

Publish Date:Apr 28, 2024

Advertisement

ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో గడిచిన ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు పంపించ‌డం వంటి ప‌నుల‌కే జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. యువ‌తకు ఉద్యోగాలు క‌ల్పించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ కంపెనీల‌ను త‌రిమేసి యువ‌త‌కు ఉపాధిని దూరం చేశారు. వైసీపీ పాల‌న‌లో క‌నీసం చిన్న‌పాటి ప‌నులు చేసుకునేందుకు కూడా ఏపీలో అవ‌కాశం లేక‌పోవ‌టంతో అధిక‌శాతం మంది ప్ర‌జ‌లు ప‌క్క రాష్ట్రాల‌కు ప‌నుల‌కోసం వ‌స‌ల వెళ్లిన ప‌రిస్థితి. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు.. వ‌చ్చే నెలలో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. ప‌లు హామీల‌తోపాటు.. సానుభూతి నాట‌కాల‌కు తెర‌ లేపారు. వీటిలో  బ‌స్సు యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌పై గుల‌క‌రాయి దాడి ఘ‌ట‌న ఒక‌టి. గ‌తంలో కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ హ‌త్య‌కేసును చంద్ర‌బాబుపై నెట్ట‌డం వంటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్న ప్ర‌జ‌లు జగన్ గుల‌క‌రాయి డ్రామాను నమ్మలేదు. నవ్వి పోయారు. దీంతో జగన్ నవ్వుల పాలయ్యారు. దాంతో ఆ డ్రామాకు తెరదించేసి, నుదుటిపై బ్యాండ్ ఎయిడ్ ను కూడా తీసేసి మేనిఫెస్టోతో మాయ చేయాలని చేసిన ప్రయత్నమూ బెడిసికొట్టింది. జగన్ మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గత ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో శనివారం (ఏప్రిల్ 27) పార్టీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో  విడుద‌ల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో గ‌తంలోని హామీల‌నే ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌.. ప‌లు ప‌థ‌కాల‌కు నిధుల‌ను పెంచారు. అయితే  గ‌తంలో 99శాతం హామీలు అమ‌లు చేశామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం ప్ర‌జ‌ల‌ను విస్మ‌యానికి గురిచేస్తోంది. ఏపీలో ఏమాత్రం అభివృద్ధి జ‌రిగిన దాఖ‌లాలు లేవు.. కానీ, జ‌గ‌న్ మాత్రం త‌న ప్ర‌సంగంలో దాదాపు అన్ని హామీల‌ను అమ‌లు చేశామ‌ని చెప్పడంపై  ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల అమ‌ల్లో జ‌గ‌న్ మోహన్ రెడ్డి అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు. జగన్ రెడ్డి హామీలఅమలు  ప్రోగ్రెస్ కార్డు ప‌రిశీలిస్తే.. హామీల అమ‌ల్లో జ‌గ‌న్ కు 10శాతం మార్కులు కూడా రాలేద‌ని చెప్ప‌డానికి సంకోచించాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

 జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమ‌ల్లో ఫెయిల్ అయ్యారు. మహిళలు, బీసీలు, రైతులు, ఎస్సీలు, ఆదివాసీలు, మైనార్టీలకు గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో జగన్ సర్కార్ ఏమేరకు అమలు చేసిందన్న విషయంపై ఓ సంస్థ  చేసిన  క్షేత్ర స్థాయి పరిశీలనలో జగన్ కు 100కు 10 మార్కులు కూడా రాలేదు. గ‌త ఐదేళ్ల పాల‌న‌లో మ‌హిళ‌లకు ల‌బ్ధి చేకూర్చ‌డంలో 100 మార్కులకుగాను కేవ‌లం 13 మార్కులే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ‌చ్చాయి. బీసీల‌కు ల‌బ్ధి చేకూర్చే విష‌యంలో 16 మార్కులు, రైతుల విష‌యంలో 16 మార్కులు, ఎస్సీల‌కు ల‌బ్ధిచేకూర్చే విష‌యంలో 13మార్కులు, ఆదివాసీల విష‌యంలో 13మార్కులు, మైనార్టీల ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో 10శాతం మార్కులు మాత్ర‌మే జగన్ ప్రభుత్వానికి వ‌చ్చాయి. ఈ ఆరు సబ్జెక్టుల్లో మొత్తం 600 మార్కుల‌కు కేవ‌లం 83 మార్కులు మాత్ర‌మే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌కు వ‌చ్చాయి. దీంతో మ‌రోసారి అధికారానికి జ‌గ‌న్ అనర్హులని భావిస్తున్న ప్ర‌జ‌లు.. మే 13న జ‌రిగే పోలింగ్ లో ఓటు ద్వారా గుణ‌పాఠం చెప్పేందుకు రెడీ అయిపోయారు. 

గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీల అమల్లోనూ ఫెయిల్ అయ్యారు. ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా సంవత్సరానికి 1 లక్ష నుంచి 5లక్షల వరకు లబ్ది కలుగుతుందని   తప్పు డు ప్రచారాలు చేసింది వైసీపీ పార్టీ. అదేవిధంగా పిల్లలందరికీ అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఒక్కరికే ఇచ్చారు. పేద అక్క చెల్లెమ్మల పేర్లపై సొంత ఇళ్ల రిజిస్ట్రేషన్ అని చెప్పిన జగన్ తెలుగుదేశం ప్రభుత్వంలో  నిర్మించిన టిడ్కొ ఇళ్లను కూడా
 ఇవ్వలేకపోయారు..

 ఇలా మహిళలకు ఇచ్చిన ప్రతి హామీలోనూ జగన్ విఫలమయ్యారు. క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాల మేరకు ఆయా హామీల అమలు విషయంలో   వైసీపీ ప్రభుత్వానికి వ‌చ్చిన మార్కుల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌తి కుటుంబానికి లబ్ది (ఒక‌ మార్కు), అమ్మఒడి ప‌థ‌కం (ఆరు మార్కులు), పేద‌లంద‌రికీ ఇళ్లు (2 మార్కులు), మ‌ద్య‌పాన నిషేదం (-2 మార్కులు), డ్వాక్రా గ్రూపుల‌కు ఆస‌రా విష‌యంలో (3 మార్కులు), పింఛ‌న్లు (2 మార్కులు), పెళ్లి కానుక (జీరో మార్కులు), అగ‌న్వాడీ వ‌ర్క‌ర్లు (ఒక మార్కు). మొత్తం 100 మార్కుల్లో వైసీపీ ప్రభుత్వానికి వ‌చ్చినవి 13మార్కులు మాత్ర‌మే. దీంతో ఐదేళ్ల‌లో మహిళలకు ఇచ్చిన హామీల అమల్లో జగన్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని స్పష్టమవుతుంది. 

వైఎస్ జ‌గ‌న్ రెడ్డి త‌న ఐదేళ్ల పాల‌న‌లో బీసీల ల‌బ్ధికోసం ఇచ్చిన హామీల అమ‌ల్లోనూ ఫెయిల్ అయ్యారు. ప్రత్యే క ఉప ప్రణాళిక ద్వారా రూ. 75,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి.. ఎలాంటి ప్రత్యే క చర్యలు తీసుకోకుండా నిధులు దారి మళ్లించేశారు. ఏ రకంగాకూడా వీటిని సబ్ ప్లాన్ నిధులు అనలేము. బీసీలకు పదవుల విషయంలోనూ ప్రాధాన్యత ఇవ్వలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును, వారికిచ్చిన హామీల అమలు అంశంలో జగన్ ప్రభుత్వానికి 100కు కేవ‌లం 16మార్కులే ప్రజలు ఇచ్చారు. అదే విధంగా వైసీపీ హ‌యాంలో రైతులు కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతుల‌కు మేలు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. రైతులకు మేలు చేసిన అంశంలో వైసీపీ ప్ర‌భుత్వానికి 100కు కేవ‌లం 16 మార్కులే ప్రజలు ఇచ్చారు. ఏ స‌మావేశం జ‌రిగినా ఎస్సీలు నా బంధువులు అని చెప్పుకునే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ఐదేళ్ల పాల‌న‌లో ఎస్సీ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను పూర్తిగా విస్మ‌రించారు. వారికి క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌క పోవ‌టంతో పాటు.. వారికి కేటాయించిన నిధులు కూడా పూర్తిస్థాయిలో ల‌బ్ధిదారుల‌కు చేర‌లేదు. దీంతో ఎస్సీ, ఎస్టీల‌కు మేలుచేసే విష‌యంలోనూ జ‌గ‌న్ ఫెయిల్ అయ్యాడు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఐదేళ్ల కాలంలో  ప్రజలు ఇచ్చింది కేవలం 13మార్కులు మాత్రమే. 

గిరిజ‌నుల‌కు ఇచ్చిన హామీల అమ‌ల్లోనూ జ‌గ‌న్ ఫెయిల్ అయ్యాడు. గిరిజనులకు ప్రత్యే క జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయ‌లేదు. 500 మంది జ‌నాభా ఉన్న ప్ర‌తి తండాను, గూడెంను పంచాయితీగా మారుస్తామ‌ని ఇచ్చిన హామీని జ‌గ‌న్ అమ‌లు చేయ‌లేదు. ఎస్సీ, ఎస్టీల‌కు పింఛ‌న్ల అర్హ‌త వ‌య‌స్సు 45ఏళ్ల‌కి త‌గ్గింపు అనే హామీని జ‌గ‌న్ అమ‌లు చేయ‌లేదు. దీంతో గిరిజ‌నుల‌కు మేలు చేసే విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంకు ప్రజలు ఇచ్చిన మార్కులు 100కు కేవ‌లం 13 మాత్ర‌మే. 

మైనార్టీలకు ఇచ్చిన హామీల అమ‌ల్లోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఐదేళ్ల కాలంలో అర‌కొర హామీల‌తోనే స‌రిపెట్టాడు. 2019 పాదయాత్రలో ఇస్లామిక్ బ్యాంకును ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన‌ జగన్.. మైనారిటీలను మోసం చేశారు. అదేవిధంగా హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. ఐదేళ్ల‌లో కేవలం రూ. 14.51 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మసీదులో ఇమామ్ లు, మౌజామ్ ల‌కు గౌరవ వేతనంగా నెలకు రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం రూ.10,000 ఇస్తున్నారు. అదే విధంగా ఇమామ్‌ల‌కు ఇళ్ళ స్థలాలు కేటాయించి, వారికి ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మోసం చేశాడు. ఇలా ముస్లింకు మేలు చేసే విష‌యంలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం  పూర్తిగా విఫ‌ల‌మైంది. ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ముస్లిం మైనారిటీలు ఇచ్చిన మార్కులు 100కు కేవ‌లం 10 మాత్ర‌మే. మొత్తంగా జగన్ రాష్ట్రంలో ఏ వర్గానికీ మేలు చేయకపోగా, అన్నివర్గాల వారినీ మోసం చేశారు. హామీల అమలు మాట అటుంచి.. పన్నుల రూపంలో వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఒక అంచనా ప్రకారం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వారి నుంచి వసూలు చేశారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో అంటూ మరోసారి మోసం చేయడానికి జగన్ చేసిన ప్రయత్నాన్ని జనం తిప్పి కొట్టానికి సిద్ధంగా ఉన్నారు.  

By
en-us Political News

  
జగన్ పని అయిపోయింది. ఎన్నికలలో ఓటమి ఖరారైపోయింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో జగన్ పార్టీ మూటాముల్లె సర్దుకోవడమే మిగిలింది. ఆ మిగిలిన కాస్తా జూన్ 4న పూర్తైపోతుంది అన్నది ఇప్పటి వరకూ పరిశీలకులు, విపక్ష కూటమి నేతలూ చెబుతున్న మాట. సామాన్యుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే అధికారికంగా ఫలితం వెలువడటానికి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉన్నా.. జగన్ పని అయిపోయిందని చెప్పడానికి తిరుగులేని రుజువుగా ఐప్యాక్ నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల పోలింగ్ స్టేషన్లలో మంగళవారం (మే14) తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. తమ వంతు వచ్చే వరకూ ఓటర్లు ఓపికతో ఎదురు చూస్తే రాత్రంతా జాగారం చేయడం ఓటరు చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
ఏపీకి జాతీయ హోదా దక్కుతుందో, లేదో గానీ, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి మాత్రం జాతీయ హోదా దక్కేట్టుంది.. అదెలాగయ్యా అంటే...
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వెల్లువెత్తింది. కొత్త ఓటర్లు, యువత తమ భవిష్యత్ ఓటుతోనే ముడిపడి ఉందని భావించారు. అందుకే పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఇక మధ్యతరగతి, దిగువ మధ్య తరగలి వారు తమ ఆస్తులకు రక్షణ ఉండాలంటే ఓటేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడమే మార్గమని నిర్ణయించుకున్నారు.
అవసరం ఉన్నా లేకున్నా మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకునే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల గొంతులు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచీ మూగబోయాయి. ఎక్కడా వారి మాట వినిపించడం లేదు. వారికి మాత్రమే అలవాటైన భాషలో ప్రసంగాలు చేయడం లేదు.
కిందపడ్డా నాదే పైచేయి అంటారు చూశారా.. అలా వుంది నగరిలో మటాష్ అవబోతున్న రోజా వ్యవహారం. మొదటగా నగరి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పదేళ్ళుగా మీ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన రోజాని మీ ఓటు ద్వారా సాగనంపారు.
ఐకాన్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సరిగ్గా ప్రచారం ముగిసే ముందు రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనకు మద్దతు ప్రకటించడం రాజకీయవర్గాలతో సహా మెగా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తాడు అని చెబుతున్నప్పుడు కేసీఆర్ ముఖంలోగానీ, కేటీఆర్ ముఖంలోగానీ కనిపించే పైశాచిక ఆనందాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు.
పోలింగ్ శాతం పెర‌గ‌డంతో వైసీపీ మ‌రింత డీలా ప‌డింది. ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ న‌మోదైతే.. అది ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంది. మ‌రోవైపు.. యువ‌త పోటెత్తారు. కొత్త‌గా ఓటు హ‌క్కు ద‌క్కించుకున్న‌వారు కూడా ఈ సారి ఓటేశారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కూట‌మి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ క‌నిపిస్తోంది.
వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయా.. ఆ పార్టీ నమ్ముకున్న గూండాయిజం వైసీపీకి గులుపు ఉన్న స్థానాలలో కూడా ఓటమిని శాశించిందా? అంటే జనం ఔననే అంటున్నారు. పరిశీలకులు కంసుడి పతనానికి ముందు కనిపించిన శకునాలను నిన్నటి పోలింగ్ లో జరిగిన సంఘటనలతో పోలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పోలింగ్ రోజే వెల్లడైపోయింది. ఓటరు ఉత్సాహంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను విస్పష్టంగా కనిపించింది. దేశ, విదేశాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి మరీ వచ్చి తమ ఓటు హక్కను వినియోగించుకున్న ప్రజలు. ప్రలోభాలు కాదు, తమకు రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధి ముఖ్యమని విస్పష్టంగా చాటారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (మే 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
వైసీపీ భ్రమలు తొలగిపోయాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులూ ఆ పార్టీకీ ఛీ కొట్టేశారు. సంక్షేమం అంటూ తమ ఇంత కాలం భ్రమల్లో ఉంచి చేసిన నిర్వాకం చాలన్నట్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లకు పోటెత్తారు. సంక్షేమ లబ్ధాదారులు కదా, మనకే ఓటేస్తారు అన్న భ్రమల్లో ఉన్న వైసీపీకి తామెటు వైపో తమ ధిక్కారం ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. నమస్కారానికి ప్రతినమస్కారం, తిరస్కారానికి తిరస్కారం అన్నట్లుగా ఏకంగా పోలింగ్ బూత్ లలోనే వైసీపీ నేతలపై తిరగబడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.