Hyderabad: యువతిపై అత్యాచారయత్నం.. స్థానికుల దాడిలో DRDO ఉద్యోగి మృతి.!

Publish Date:Oct 22, 2026

Advertisement

DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు రంగప్రవేశం చేసి అతడిపై దాడికి పాల్పడటంతో DRDO ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న రామ్మోహన్ (40) DRDO ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

తన నివాసానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో ఉంటున్న ఓ యువతిపై మనసు పడ్డాడు. ఈ క్రమంలో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో సదరు యువతి గట్టిగా కేకలు వేయడంతో పక్క ఫ్లాట్‌లో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వారు రామ్మోహన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. 

ఈ దాడిలో రామ్మోహన్ తలకు తీవ్ర గాయాల య్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో  రామ్మోహన్  అనే వ్యక్తి తన భార్య కాత్యా యినితో కలిసి గత రెండు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. ఇతను  డిఆర్డిఓ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను గత కొంతకాలంగా ఇంటి పక్కనే ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు. దీంతో ప్రతిసారి ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా రామ్మోహన్ యువతిని వేధించసా గాడు. దీంతో సదరు యువతి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న అభిజిత్ అనే యువకుడికి విషయం మొత్తం చెప్పింది.

దీంతో ఆగ్రహం చెందినే అభిజిత్ వచ్చి రామ్మోన్ను గత కొంతకాలంగా యువతిని ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నిం చాడు. దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగి పెద్ద ఎత్తున గొడవ జరగడంతో అభిజిత్ ఒక్కసారిగా రామ్మోహన్ను గట్టిగా తోసేసాడు. దీంతో రామ్మోహన్ తలకు గాయమైంది. అది గమనించిన అతని భార్య వెంటనే  రామ్మోహన్ ను  కాచిగూడ లోని సీసీ షరాఫ్ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించగా చికిత్స పొందుతూ చెందాడు. రామ్మోహన్ భార్య కాత్యాయిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

 

 

 

[ DRDO employee Rammohan, Attempted rape of a young woman, Chikkadapalli Police Station, Crime news, Hyderabad Police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]
 

By
en-us Political News

  
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.