లాడెన్ గురించి చెప్పిన డాక్టర్ ను వదిలేస్తా.. ట్రంప్
Publish Date:May 3, 2016
Advertisement
చైనా, ఇండియాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పాకిస్థాన్ తో కూడా తిట్లు తిట్టించుకునేలా ఉన్నారు. 9/11 అంటే మనకు వెంటనే గుర్తొచ్చే విషయం అగ్రరాజ్యమైన అమెరికా ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదుల దాడి. బిన్ లాడెన్ నేతృత్వంలో ఆల్ ఖైదా దాడులు చేసింది. అయితే ఈ దాడులకు పాల్పడి.. అనంతరం బిన్ లాడెన్ ను అంతమొందించేందుకు అమెరికన్లలకు సహకరించి.. లాడెన్ జాడను తెలిపిన డాక్టర్ షకీల్ అఫ్రిది ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు దానిని గుర్తుచేస్తూ డొనాల్డ్ ట్రంప్.. నేను అధ్యక్షుడినైతే షకీన్ ను రెండు మూడు నిమిషాల్లో విడిపిస్తా అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అక్కడితో ఆగకుండా మనం పాక్ కు నిధులిస్తున్నాం.. మన మాట వాళ్లు వింటారు అని అన్నాడు. అయితే దీనికి పాకిస్థాన్ మాత్రం తీవ్రంగా స్పందించి ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు షకీల్ అఫ్రిదిని విడుదల చేయడానికి ట్రంప్ ఎవరని.. ఆయనకు పాకిస్థాన్ గురించి పెద్ద అవగాహన లేనట్టుంది.. చిల్లర విదిల్చుతూ భయపెడదామని చూడటం పొరపాటు.. అఫ్రిది సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అమెరికాకు ఏం సంబంధం ఉంది.. మా దేశపు కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి అని ఘాటుగా పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చౌదరీ నిస్సార్ అలీ ఖాన్ నిప్పులు చెరిగారు.
http://www.teluguone.com/news/content/-donald-trump-39-59624.html





