Publish Date:Mar 29, 2026
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు అధికార డీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఆదివారం (మార్చి 29) చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివళయం లో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోను ఆయన సూపర్ స్టార్ గా అభివర్ణించారు.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు. ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక రైతు సంక్షేమానికి కూడా డీఎంకే మేనిఫెస్టో పెద్ద పీట వేసింది.
వరి మద్దతు ధరను క్వింటాల్ కు 3,500 రూపాయలకు, చెరకు మద్దతు ధర టన్నుకురూ. 4,500కు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయానికి మీటర్లు లేని ఆధునిక పంపుసెట్లను ఉచితంగా అందిస్తామని డీఎంకే మేనిఫెస్టో హామీ ఆచ్చింది. సామాజిక భద్రతలో భాగంగా, వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను నెలకు రెండు వేల రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్‌నురెండువేల ఐదువందల రూపాయలకు పెంచు తామన్న హామీని కూడా డీఎంకే మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు అమలవుతున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరిస్తామనీ, ఉన్నత విద్య అభ్యసించే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని డీఎంకే మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కవరేజీని 10 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు, పథకానికి అర్హత ఆదాయ పరిమితిని ఏడాదికి ఐదు లక్షలకు పెంచుతామని పేర్కొంది. ఇంకా ఐదేళ్లలో కలైంజర్ కనవు ఇల్లం పథకం ద్వారా 1కొత్తగా 0 లక్షల ఇళ్లు నిర్మిస్తామని పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-dmk-manifesto-a-superstar-25-216376.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.