దాసరి మరో బాంబు !
Publish Date:Jan 7, 2013
Advertisement
ఏదో వ్యాఖ్యలతో ఈ మధ్య వరుసగా వార్తల్లో ఉంటూ వస్తున్న దర్శక రత్న దాసరి నారాయణ రావు మరో సంచలన వ్యాఖ్య చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది ‘పెద్దోళ్ళు’ చిత్ర పరిశ్రమ పేరు చెప్పుకొని ఉన్నత స్థానాల్లోకి వెళ్లారని, అయితే, వారు ఎవ్వరూ తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక్క సినిమా కూడా తమ కేరీర్లలో తీయలేదని దుయ్యబట్టారు. వీరు చిత్ర పరిశ్రమలో వచ్చిన తమ ఆదాయాన్ని ఇతర కార్యకలాపాలలోకి మళ్లిస్తున్నారని దాసరి అన్నారు. ఇలాంటి వారంతా ధియేటర్లను, స్టూడియోలను అద్దెకు ఇస్తున్నారని దాసరి వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్ళంతా, రాష్ట ప్రభుత్వం నుండి, సినీ పరిశ్రమ నుండి అనేక రకాలుగా రాయితీలు పొంది కూడా తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఏమీ చేయడం లేదని దాసరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన ‘మిధునం’ సినిమా విజయోత్సవంలో పాల్గొన్న దాసరి గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని కొంత మంది తన వ్యతిరేకులను అప్పుడప్పుడూ ఇలా దుమ్మెత్తి పోస్తూ ఉండటం ఆయనకు అలవాటు అయిపొయింది. ఆ తర్వాత వాళ్ళను అనలేదని సంజాయిషీ ఇవ్వడమూ ఆయనకు అలవాటు అయిపొయింది. ఆ మధ్య సురేష్ కృష్ణ రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఏదో వ్యాఖ్య చేసి, ఆ తర్వాత అవి అక్కినేని ని గానీ, రామ్ చరణ్ ను కానీ ఉద్దేశించి చేయలేదని ‘సంజాయిషీ’ ఇచ్చేసారు. మరి ప్రస్తుతం దాసరి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేసిన్చినవో తెలుసుకోవాలంటే కొంచెం సమయం పడుతుందేమో !
http://www.teluguone.com/news/content/-dasari-narayana-rao-comments-24-20270.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





