నిరుద్యోగులు పరాన్నజీవులు సీజేఐ సంచలన వ్యాఖ్యలు

Publish Date:May 16, 2026

Advertisement

 

 కామెంట్లపై సీజేఐ సూర్యకాంత్ వివరణ..

నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వెల్లడి..

ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న సమయంలో న్యాయవ్యవస్థపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే సమాజంలోని కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి సీజేఐ వాడిన పదజాలం ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అనే విషయాలపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  

ఢిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ల హోదా కేటాయింపు మార్గదర్శకాల అమలులో ఆలస్యం జరుగుతోందంటూ దాఖలైన ఒక కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన లాయర్ ప్రవర్తనపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

సీనియర్ లాయర్ హోదా అనేది కోర్టు ఇచ్చే గౌరవమని, దాన్ని ప్రతిష్ట కోసం ఆశించి ఇలాంటి పిటిషన్లు వేయడం సరికాదని కోర్టు మందలించింది. సదరు లాయర్ గతంలో ఫేస్‌బుక్‌లో న్యాయవ్యవస్థపై వాడిన భాషను కూడా సీజేఐ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రొఫెషనల్ డిసిప్లిన్ అంటే ఏంటో చూపిస్తామంటూ ధర్మాసనం హెచ్చరించింది.  

ఈ క్రమంలోనే వ్యవస్థలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ సీజేఐ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో కొందరు పరాన్నజీవుల్లా మారి వ్యవస్థలను టార్గెట్ చేస్తున్నారని, పిటిషనర్ కూడా వారితో చేతులు కలపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంలోనే కొందరు నిరుద్యోగ యువకులు బొద్దింకల మాదిరిగా తయారవుతున్నారని, వారికి వృత్తిలో సరైన ఉపాధి లేదా గుర్తింపు దక్కకపోవడంతో మీడియా, సోషల్ మీడియా, ఆర్‌టీఐ యాక్టివిస్టులుగా అవతారమెత్తుతున్నారని వ్యాఖ్యానించారు. అలా మారి ప్రతి ఒక్కరిపై బురదజల్లడమే పనిగా పెట్టుకుని వ్యవస్థలపై అటాక్ చేస్తున్నారంటూ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.  

మరోవైపు నల్లకోటు వేసుకుని తిరుగుతున్న చాలా మంది లాయర్ల డిగ్రీల అథెంటిసిటీపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దేశంలో నకిలీ డిగ్రీలతో లాయర్లుగా చలామణీ అవుతున్న వారి సర్టిఫికెట్లను సీబీఐతో వెరిఫై చేయించాలని అనుకుంటున్నట్లు కోర్టు పేర్కొంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఘాటుగా విమర్శించింది. 

కోర్టు ఆగ్రహాన్ని చూసిన సదరు పిటిషనర్, వెంటనే ధర్మాసనానికి క్షమాపణలు చెప్పి తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ విచారణలో సీజేఐ వాడిన "బొద్దింకలు", "పరాన్నజీవులు" అనే పదాలు నిరుద్యోగ యువతను అవమానించేలా ఉన్నాయంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. అయితే కోర్టు వ్యవస్థలను అప్రతిష్ట పాలుచేసే ఫేక్ యాక్టివిస్టులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు వాదిస్తున్నారు.  

సీజేఐ వివరణ ఇచ్చారు. ‘మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసింది. నిరుద్యోగ యువతను బొద్దింక‌లతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని తప్పుబట్టాను. అలాంటి వారు పరాన్నజీవులని చెప్పాను. యువతను విమర్శించలేదు, భారత యువత గర్వకారణం. భారత యువతే అభివృద్ధికి మూల స్తంభం’’ అని తెలిపారు.


 

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.