చంద్రబాబు ప్రచార రథాలపై నిలువెత్తు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్.. ఎన్ఎస్జీ సూచన

Publish Date:Dec 17, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకే ముప్పు పొంచి ఉందని జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) భావిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న  ఎన్ఎస్జీ మరో సారి చంద్రబాబు భద్రతపై దృష్టి పెట్టింది. స్వల్ప వ్యవధిలో చంద్రబాబు భద్రతపై రెండు సార్లు సమీక్ష చేసింది. తాజాగా ఎన్ఎస్జీ తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వచ్చింది.  చంద్రబాబు పర్యటించే ప్రదేశాలు.. కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు వంటి అన్ని అంశాలను నిశితంగా పరిశీలించింది. చంద్రబాబు ఛాంబర్ ప్రచార రథాలను  పరిశీలించారు. అదేవిధంగా చంద్రబాబు ప్రచార సమయంలో రాత్రిపూట బస చేసే బస్సును   పరిశీలించి.. భద్రతా పరంగా కొన్ని మార్పులు సూచించింది. అలాగే టీడీపీ ప్రచార రథాలపైకి ఎక్కి మరీ పరిశీలించింది. రథం పై నుంచి ఆయన ప్రసంగించే ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్ఎస్జీ కీలకు సూచనలు చేసింది.

వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినది ఆయన హైట్ కు సరిపోయేలా ఆయన ప్రసగించే చోట నిలువెత్తు బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని ఏర్పాటు చేయాలన్న ఎన్ఎస్జీ సూచన. ఆ తరువాత ఎన్ఎస్జీ బృందం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది. ఇలా ఎన్ఎస్జీ బృందం చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం గత నాలుగు నెలలలో ఇది రెండో సారి. గత ఆగస్టులో ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్ సింగ్ టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఉండవల్లి నివాసాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఆయన భద్రతను ఎన్ఎస్జీ పెంచింది. 

కాగా గతంలోనూ ఒకసారి చంద్రబాబు భద్రతకు సంబంధించి కేంద్ర దర్యాప్తు బృందం ప్రత్యేకంగా పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల నందిగామలో పర్యటించిన సమయంలో రాళ్ల దాడి జరిగి.. ఆయన భద్రతా సిబ్బంది చీఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు హోం శాఖకు లేఖరాశారు. దీంతో చంద్రబాబు భద్రత అంశంపై మరోసారి ఎన్ ఎస్ జీ బృందం పరిశీలనకు రావడం గమనార్హం. అప్పట్లో చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చంద్రబాబుకు అతి సమీపానికి అధికార వైసీపీ కార్యకర్తలు చేరుకోవడం వంటి ఘటనల నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై సమీక్షించిన ఎన్ఎస్జీ ఇప్పుడు తాజాగా ఆయన భద్రతకు సంబంధించిన అంశాలను మరోమారు పరిశీలించి సమీక్షించడంతో ఆయనకు  ముప్పు ఉందన్న సంగతిని తెలియజేస్తున్నాయి.  

ఇక తాజాగా ఎన్ఎస్జీ సమీక్ష కు కారణమేమిటంటే.. ఇటీవల నందిగామలో పర్యటించిన చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. అది చంద్రబాబుకు కాకుండా ఆయన సెక్యూరిటీ చీఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై చంద్రబాబు హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.  దీంతో చంద్రబాబు భద్రత అంశంపై మరోసారి ఎన్ ఎస్ జీ బృందం పరిశీలనకు వచ్చింది. జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ ఉన్న చంద్రబాబు భద్రత విషయంలో  ఎటువంటి అలసత్వానికీ తావు ఉండరాదన్న భావనతోనే ఎన్ఎస్జీ నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు ఆయన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిదని చెబుతున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.