Publish Date:Apr 30, 2026
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నర్మదా నదిపై ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం బర్గి డ్యామ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక క్రూయిజ్ బోట్ అకస్మాత్తుగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 40 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన గురువారం (ఏప్రిల్ 30) సాయంత్రం చోటుచేసుకుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల వల్ల భారీ ఈదురుగాలులు వీచడంతో పడవ నియంత్రణ కోల్పోయి నదిలో మునిగిపోయింది. ప్రయాణికులు హాహాకారాలు చేస్తుండగానే క్షణాల్లో పడవ నీటిలో మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ ) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ప్రమాద సమయంలో పడవలో ఉన్న వారిలో 16 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీయగలిగారు. అయితే.. గాలి వేగం ఎక్కువగా ఉండటం, చీకటి పడటంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. పడవలో సామర్థ్యానికి మించి పర్యాటకులను ఎక్కించడం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో చాలా మంది ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-boat-sinks-in-burley-dam-36-218680.html
శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం దొరక్క.. కుటుంబానికి భారమయ్యానన్న వేదనతో అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు కసరత్తులు వేగవంతమయ్యాయి.
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో టీజీఆర్టీసీ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.
2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.