అధికారం కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలా?

Publish Date:Apr 24, 2023

Advertisement

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బిజెపి..మరోమారు అధికారం కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. అధికారంలో ఉన్న రాష్టాంల్లో మళ్లీ అధికారంలోకి రావాలనుకోవడంలోనూ తప్పులేదు. అలాగే కొత్తగా తెలంగాణ,ఎపీల్లోనూ కూడా కమలం వికసించాలని కోరుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఏ రాజకీయ పార్టీ అయినా.. అధికారం కోసం ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. అధికారం కావాలని ప్రయత్నించడంలోనూ తప్పులేదు.

దేశం అంతా తమ ఏలుబడిలో ఉండాలని కోరుకోవడాన్నీ తప్పుపట్టలేం.  అయితే  ఆఅధికారం ఎందుకోసం..ఎవరికోసం.. అన్న ప్రశ్నలు వేసుకోవాలి. కేవలం వెూడీని వెూయడానికేనా.. లేక ప్రజలకు మేలు చేయడానికా అన్న జనం, రాజకీయ ప్రత్యర్థులు, పరిశీలకులు సంధిస్తున్న ప్రశ్నలకు బీజేపీ అగ్రనాయకత్వం సమాధానం చెప్పి తీరాలి.  పార్లమెంటులో సమస్యలపై చర్చకు సిద్ధం కాని వారు,  విపక్షాలు ప్రశ్నించడాన్ని కూడా సహించలేని వారు అధికారం కోసం అర్రుచాడం ఏమిటన్నదే పరిశీలకులు సంధిస్తున్న ప్రశ్న.  

అలాగే ప్రజలకు అధికారంలో ఉండగా చేసిన మంచేమిటో చెప్పుకొని మరోసారి అధికారం కోసం జనాలను ఓట్టు అడగాలి. ప్రజలకు మంచి చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా మంచిదే... ఆ పని బిజెపి చేస్తుందనుకుంటే ప్రజలు తప్పకుండా బిజెపినే ఆదరిస్తారు. కానీ  బీజేపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. అధికారం కోసం ప్రజల మధ్య విభేదాలు, విద్యేషాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడానికి కూడా ఆ పార్టీ నేతలు వెనుకాడటం లేదు. తెలంగాణ పర్యటనలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమైనవేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ప్రకటించడం అందులో భాగమేనని అంటున్నారు.  

అలాగే మోడీ మరో సారి ప్రధాని కావాలనుకోవడం లో తప్పులేదని, అయితే ఆ పదవి కోసం మరో పార్టీ నాయకుడు ప్రయత్నించడం ఎంత మాత్రం సరికాదన్న అర్ధం వచ్చేలా అమిత్ షా ప్రసంగం సాగింది.  దేశంలో పీఎం సీటు ఖాళీగా లేదని  అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ప్రధాని పదవికి రెండు పర్యాయాలు మోడీని ప్రజలు ఎన్నుకున్నారు. వారికి మోడీ పాలన నచ్చితే మరో సారి ఆ అవకాశం ఇస్తారు. లేకుంటే.. మరో వ్యక్తికి అవకాశం ఇస్తారు. అంతే కానీ.. ప్రజలు అలా అవకాశం ఇవ్వడానికే వీల్లేదన్న ధోరణిలో అమిత్ షా చేసిన ప్రసంగం ప్రజల విచక్షణను అవమానించడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.