నటసామ్రాట్ పుట్టినరోజు
Publish Date:Sep 20, 2013
Advertisement
తెలుగు సినీ రంగంలో పరిచయాలే అక్కర్లేని ఒకే ఒక పేరు...అక్కినేని నాగేశ్వరరావు. 90 వసంతాల ఈ దసరాబుల్లోడు..తన 75 ఏళ్ల నటప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆ నిత్య వసంతుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నటసామ్రాట్ సినీ గమనాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం.. 1940లో ధర్మపత్ని చిత్రంతో తెరంగేట్రం చేశారు..ఏయన్‌ఆర్. ఆయన 1944లో విడుదలైన `శ్రీ సీతారామజననం` చిత్రంతో కథానాయకుడిగా మారారు. దాదాపు 260 చిత్రాలలో మనల్ని అలరించిన ఆయన ఇంకా నటిస్తూనే ఉండటం మన అదృష్టమనే చెప్పాలి. ఇటీవల ఆయన బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం చిత్రంలో వాల్మీకి పాత్ర పోషించగా, అక్కినేని మూడు తరాలు కలిసి చేస్తున్న మనం సినిమాలో నటిస్తున్నారు. అక్కినేని సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో గెలుపు ఓటములు చూశారు. ఓడిన ప్రతీసారీ కొత్త పాఠం నేర్చుకుని...గెలిచిన ప్రతీసారి తనను తాను కొత్తగా మలుచుకుని ..నిత్యవిద్యార్ధిలా జీవితంలో ప్రతీ క్షణాన్ని జీవిస్తూనే ఉంటారు. నటుడిగా...నిర్మాతగా ఆయన ప్రదర్శించే నియమ నిబద్ధతలు సినీ ఇండస్ట్రీకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.
ఏయన్ఆర్ సినిమాలు ...వసంతానికి కేరాఫ్ అడ్రస్సుల్లా అనిపిస్తాయి. ఆయన డైలాగ్స్, ఎక్స్ ప్రెషన్స్, స్టెప్స్ ...అన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆయన ప్రతీ చిత్రం మనసును మంత్రిస్తుంది. ఒక దేవదాసు...ఒక ప్రేమాభిషేకం ..ఇలా చెప్పుకుంటూ పోతే అక్కినేని నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకులను అప్పటికి ఇప్పటికీ, ఎప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి....ఉంటాయి.
ఎవరినైనా ప్రేమించాలంటే ..ఏయన్‌ఆర్ సినిమాలు చూడాలి...ప్రేమలో విజేత కావాలనుకుంటే ...అక్కినేని చిత్రాలే చూడాలి. ..ప్రేమలో ఓడాలన్నా...అక్కినేని సినిమాలే వాచ్ చేయాలి. ...ఎందుకంటే తెలుగు సినిమా ప్రేమ గురువు మన ఏయన్‌ఆర్.
వెండితెరకు బంగారు మెరుగులు దిద్దిన మహానటుడు ఏయన్‌ఆర్. ఆయన నడిచే ఒక నటవిశ్వరూపం. ప్రతీ పాత్ర పోషణలో ఆయన తీసుకునే జాగ్రత్తలు ..ఇన్నాళ్ల నట ప్రస్థానంలో ఆయన ప్రతీ నిమిషం పాటించే క్రమ శిక్షణ ..వృత్తిపరమైన ప్రేమ...ఆయన్ను మహోన్నత సినీ శిఖరంలా నిలబెట్టాయి. పద్మవిభూషణ్‌తో ఆయన అవార్డుల పరంపర ఆగదు...అది నిరంతర ప్రవాహంలా అలా సాగుతూ ఇంకా ఎన్నో విశిష్ఠ పురస్కారాలను అక్కినేనికి అందిస్తుంది.
ఒక నటుడిగా ఎదిగి..ఒక మనిషిగా ఒదిగి...ఎదిగే కొద్ది ఒదగమనే మాటకు నిలువెత్తు నిదర్శనంలా అనిపిస్తారు...అక్కినేని. రొమాంటిక్ కింగ్...ట్రాజెడీ కింగ్ ..నట సమ్రాట్ ..ఇలా ఎన్నో బిరుదులు ఆయన్ని వరించాయి. 1980లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్న అక్కినేని...దానికి ముందే పద్మశ్రీ...ఆ తర్వాత పద్మభూషణ్ ..అటు తర్వాత దాదా ఫాల్కే... పద్మవిభూషణ్ ..ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతీ అవార్డును అందుకున్నారు...మన అక్కినేని,
90 ఏళ్ల వయసులో కూడా సినీ కళామతల్లికి సేవ చేస్తున్న అక్కినేని మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగువన్ తరుపున మరోసారి ఆ నటసామ్రాట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
http://www.teluguone.com/news/content/-akkineni-nageswara-rao-32-25969.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





