మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కేకు ఎదురుగాలి?

Publish Date:May 11, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా కొందరు వైసీపీ నేతల మాటల్ని బట్టి, సీఎం జగన్ పార్టీ నేతలతో చేస్తున్న సమీక్షలు, ఇప్పటి నుంచే వారికి పార్టీ పరంగా అప్పజెబుతున్న బాధ్యతల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం అమరావతి ప్రాంతంలో ముఖ్యమైన, చారిత్రక మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి గడ్డుకాలం ఎదుర్కోక తప్పదనే అంచనాలు వస్తున్నారు. ఆర్కే 2014లో తొలిసారిగా వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై 5 వేల 337 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్ డీఏ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

అయితే.. మంగళగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గం ప్రజలకు ఆర్కే చేసిన మేలు ఏమిటనేది చూస్తే.. అతి స్వల్పమే అంటారు స్థానికులు. నియోజకవర్గం బాగోగుల గురించి అంతగా పట్టించుకోని ఆర్కే.. ఎంతసేపూ సీఆర్ డీఏ చైర్మన్ హోదాలో అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలపై ఫిర్యాదులు చేయడానికే సమయం అంతా వెచ్చిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి భూముల విషయంలో ప్రతినిత్యం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పైన, టీడీపీ హయాంలో మున్సిపల్ మంత్రిగా వ్యవహరించిన పొంగూరు నారాయణపైన ఆరోపణలు చేయడం, ఫిర్యాదులు చేయడంపైనే ఉంటారని చెబుతారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాము సంతోషంగా తమ భూములు ఇస్తే.. చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారంటూ ఆర్కే ఆరోపణలు చేయడం సరికాదని కొందరు దళితులు ఖండించడం విశేషం. దళితులను అవహేళన చేస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని దళితులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనూహ్య పరిణామమే. ఆర్కేకి నిజంగా మంగళగిరిపై, దళితులపై ప్రేమ ఉంటే.. అమరావతిని అభివృద్ధి చేసి చూపించాలనేది దళితుల సవాల్. అమరావతి నిర్మాణం కోసం రైతుల భూమిని బలవంతంగా లాక్కున్నారన్న ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలను పలువురు రాజధాని ప్రాంత రైతులు కూడా ఖండించడం గమనార్హం. అమరావతి భూముల విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే రాజకీయం చేస్తున్నారని వారు తూర్పారపడుతుండడం గమనించదగ్గ విషయం.

ప్రతినిత్యం వైసీపీ అధినేత వైఎస్ జగన్ భజనతోనే ఎమ్మెల్యే ఆర్కే తరిస్తుంటారని, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్లలో ఆయన చేసిందేమీ లేదని ప్రజలు పెదవి విరుస్తుండడం విశేషం. ఒకసారి గెలిపిస్తే.. ప్రతిపక్షంలో ఉండడం వల్లే అభివృద్ధి చేయలేకపోయారని సరిపెట్టుకున్నామని, ఈ సారి అధికారపక్షంలో ఉన్నా ఆర్కే తమకేమీ ఒరగబెట్ట లేదని వారు ప్రత్యక్షంగానే వారు విమర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగినా.. లేదా ముందుగా జరిగినా.. ఆర్కే గెలిచే పరిస్థితి ఉండబోదని స్థానికులే చెబుతుండడం గమనార్హం.

మరో పక్కన ఈ సారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేయాలని టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ డిసైడ్ అయ్యారనే అంచనాలే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కొన్నాళ్లుగా మంగళగిరిలోనే అనునిత్యం గడుపుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి నియోజకవర్గంలో ఏడో ఒక చోట ప్రజల మధ్య లోకేష్ ప్రత్యక్షం అవుతున్నారు. ‘పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి’ అన్న లోకోక్తి ప్రకారం గతంలో మంగళగిరిలోనే ఓడిన నారా లోకేష్ ఇదే నియోజకవర్గంలో రెట్టించిన పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఎవరికి ఏమి కష్టం వచ్చినా.. వెంటనే అక్కడ వాలిపోతున్నారు. బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను, సీఎం జగన్ ను నిలబెట్టి కడిగేస్తున్నారు. గతంలో తానెవరో నియోజకవర్గం ప్రజలకు అంతగా తెలియకపోయినా సిటింగ్ ఎమ్మెల్యే ఆర్కేకు గట్టి పోటీనే ఇచ్చారు. వారిద్దరి మధ్యా ఓట్ల తేడా స్వల్పమే. ఇప్పుడు నియోజకవర్గం ప్రజల మధ్యే నిరంతరం ఉండడంతో లోకేష్ అంటే మరింత క్రేజ్ వచ్చిందంటున్నారు.

గత ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆర్కే పేదలకు 4 రూపాయలకే భోజనం, 10 రూపాయలకే సంచి నిండా కూరగాయలు లాంటి టక్కు టమార విద్యలు ప్రదర్శించారంటారు. అయితే.. రెండోసారి గెలిపించిన ప్రజలకు ఆర్కే జనాలకు అవసరమైన కార్యక్రమాలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల ముందు ఆర్కే ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అసలు నియోజకవర్గంలోనే కనిపించడంలేదని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తే స్థానిక ఎమ్మెల్యేగా ఆర్కే ఏ మాత్రం స్పందించడం లేదని, ఎమ్మెల్యే మిస్సయిపోయారంటూ లోకేష్ చేస్తున్న విమర్శల్లో వాస్తవం ఉందనేది జనం మాటగా ఉంది. నియోజవర్గాన్ని చుట్టేస్తున్న లోకేష్.. గత ఎన్నికల్లో తనకు పెద్దగా ఓట్లు పడని ప్రాంతాలపై మరింతగా దృష్టి సారించి పనిచేసుకుపోతున్నారు.

ఇటీవలే జరిగిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల సందర్భంగా మహిళా అభ్యర్థిని ఎమ్మెల్యే ఆర్కే కిడ్నాప్ చేయించారని మీడియాలో వార్తలు రావడం ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిందంటున్నారు. దుగ్గిరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్ పై ఆళ్ల డ్రైవర్ రాళ్ల దాడి చేయించిన సంఘటనతో ఆర్కేపై నియోజవర్గం ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చిందంటున్నారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే చేసుకున్న స్వయం కృతం, నారా లోకేష్ ప్రజల మధ్యకు దూసుకుపోతున్న కారణంగా ఈ సారి ఎన్నికల్లో ఆర్కేకు గడ్డు పరిస్థితులు తప్పవనే రాజకీయ విశ్లేషకుల అంచనా.

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.