నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయెల్.!
Publish Date:Aug 5, 2026
Advertisement
ఇండియాలో రోడ్డు భద్రత, వాహన రక్షణ వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదా వాహన బీమా లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్విక్రయాలను పూర్తిగా నిరాకరించే ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నియమాన్ని ప్రాథమికంగా నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్ అనే ప్రత్యేక విధానం రూపంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆదేశించింది. వాహన యజమానులు సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను గుర్తించేలా చేయడం, దురదృష్టవశాత్తు రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తగిన ఆర్థిక పరిహారం సకాలంలో అందేలా చూడటమే ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రస్తుతం దేశంలోని రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో సగానికి పైగా సరైన ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండానే యథేచ్ఛగా ప్రయాణిస్తున్నాయనీ, ఇది దిగ్భ్రాంతికరం, ఆందోళనకరం అని పేర్కొంది. మోటారు వాహనాల చట్టం నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమన్న సుప్రీం కోర్టు.. బీమా లేని వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు, వారి కుటుంబాలు ఆర్థిక నష్టాన్ని, మానసిక క్షోభను అనుభవిస్తున్నారనీ, దేశంలో ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న తరుణంలో, ఈసమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. Supreme Court vehicle insurance rule, No insurance no fuel policy, Third party vehicle insurance, Motor Vehicles Act compliance
http://www.teluguone.com/news/content/--supreme-court-vehicle-insurance-rule-36-228084.html





