పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి నిమిషాల ముందు బీజేపీ కీలక నేత, ఆ పార్టీ నందిగ్రామ్ అభ్యర్థి సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు తథ్యమనీ, ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై సువేందు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు సంబంధించి అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. టీఎంసీ నేతల మాటల్లో అహంకారం కనిపిస్తోందని, ప్రజాస్వామ్యంలో అహంకారానికి తావులేదన్నారు. తమ అరాచక పాలనతో ప్రజలను ఇబ్బంది పెట్టిన వారికి ఈ ఫలితాలు గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా పటిష్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నందిగ్రామ్ వంటి కీలక స్థానాల్లో ఫలితం ఎలా ఉండబోతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/--end-of-jungle-raj--in-bengal-is-certain-39-218881.html
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.