వైఎస్సార్‌ చివరి కోరిక.. రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్‌

Publish Date:Sep 2, 2026

Advertisement

ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!

ఢిల్లీలో నిర్వహించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాల కారణంగానే దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుందని అన్నారు.

రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించే చర్యలను దేశంలో తొలిసారిగా చేపట్టిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో సోనియాగాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. పేదలకు అసైన్డ్‌ భూములు పంపిణీ చేయడం, పీడీఎస్‌ విధానం ద్వారా రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందించడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని అన్నారు.

తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామంటే.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలే అందుకు పునాది అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్‌ అందించడంపై తొలి సంతకం చేసిన గొప్ప నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. అప్పట్లో రూ.1,300 కోట్ల విద్యుత్‌ బకాయిలను రద్దు చేసి, రైతులపై కేసులను ఎత్తివేసి వారి గుండెల్లో వైఎస్సార్‌ చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు.

తెలంగాణలో సాగునీటి విస్తరణకు ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వంటి ప్రాజెక్టులకు వైఎస్సార్‌ హయాంలో శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్‌ ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు ప్రస్తుతం నిలిచిపోయాయని, వాటిని పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులకు రేవంత్‌రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. వైఎస్‌ చివరి కోరిక ఇంకా నెరవేరలేదని అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన జీవిత లక్ష్యమని వైఎస్సార్‌ చెప్పారని గుర్తుచేశారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే ఆయన మరణించారని అన్నారు.

దేశ ప్రజలు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో నాయకుడు ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశానికి బలమైన నాయకత్వం అవసరమని, రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ప్రజల మద్దతు అవసరమని పిలుపునిచ్చారు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని రేవంత్‌రెడ్డి అన్నారు.

 

(YS Rajasekhar Reddy, YSR Awards 2026, Revanth Reddy, Telangana CM Revanth Reddy, Rahul Gandhi, Rahul Gandhi PM, YSR Legacy, YSR Last Wish, Congress Party, Mallikarjun Kharge, Telangana Politics) 

By
en-us Political News

  
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.