రైతుల కోసం పాదయాత్ర ప్రకటించిన కేటీఆర్..!

Publish Date:Sep 3, 2026

Advertisement

మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!

నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాదయాత్రకు పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో నిర్వహించిన రైతు ధర్నా వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయకపోతే.. వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపడతానని కేటీఆర్‌ తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 2003లో రైతుల సమస్యల పరిష్కారం కోసం అప్పటి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. నీటి కోసం అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడారని చెప్పారు.అదే స్ఫూర్తితో కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాను కూడా పాదయాత్ర చేపడతానని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

నాగార్జున సాగర్‌లో 180 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ.. ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్‌ 14లోపు నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపట్టి.. ప్రభుత్వం నీటిని విడుదల చేసేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

 

 

(KTR, KTR Padayatra, KTR Farmers Protest, Nagarjuna Sagar, Nagarjuna Sagar Left Canal, Farmers Issues, Telangana Farmers, KTR Warning, BRS, KCR, Kodad, Halia, Miryalaguda, Irrigation Water, Telangana News, Telugu One, Telugu News)

By
en-us Political News

  
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.