సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారు : కొండా సురేఖ

Publish Date:Sep 3, 2026

Advertisement

సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత కలకలం రేగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారి చివరకు అధిష్ఠానం వద్దకు చేరాయి. పార్టీ హైకమాండ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి, బ్లాక్‌మెయిల్ రాజకీయం చేస్తూ తనను కేబినెట్ నుంచి తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు.

వరంగల్ వేదికగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక నేతలపై చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శల తుఫానుకు మూలకారణంగా నిలిచాయి. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ కోరగా, తన కుమార్తె ఒక స్వతంత్ర వ్యక్తి అని, ఆమె మాట్లాడిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని సురేఖ స్పష్టం చేశారు. అయితే, పార్టీ నేతల ఒత్తిడి పెరగడంతో అధిష్ఠానం పిలుపు మేరకు ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది.

ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై ఏ విధమైన అవినీతి మరకలు లేవని, మంత్రిగా తన పనితీరు మెరుగ్గా ఉందని విన్నవించారు. తనపై చర్యలు తీసుకునే ముందు, మంత్రివర్గంలోని ఇతర నేతలపై వస్తున్న ఆరోపణలు, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం.

 

ఒక బీసీ మహిళా నేతనైనందుకే తనను కావాలని లక్ష్యంగా చేసుకుంటున్నారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని, కొందరు మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అధిష్ఠానం ఒత్తిడి తెచ్చినా తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఒకవేళ సీఎం తెస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి బర్తరఫ్ చేయాలనుకుంటే చేసుకోమని సురేఖ బహిరంగంగానే సవాల్ విసిరారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ సరికాదని, కావాలని కొంతమంది నేతలతో ప్రెస్ మీట్లు పెట్టించి తనపై లీకులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు.

ఢిల్లీ వేదికగా చోటుచేసుకున్న ఈ సంచలన పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సీనియర్ మంత్రికి మధ్య నెలకొన్న ఈ పోరును అధిష్ఠానం ఏ విధంగా సర్దుబాటు చేస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

వరంగల్ ప్రాంతంలో బలమైన వర్గపోరుగా మారిన ఈ వ్యవహారంలో అధిష్ఠానం కఠిన చర్యలకు దిగుతుందా లేక నష్టనివారణ చర్యలు చేపడుతుందా అనేది రాబోయే రెండు రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

 

 

(Konda Surekha Bartaraf, CM Revanth Reddy, Telangana Cabinet, Telangana Politics, Revanths Sensational Decision, Nerella Sarada, gundu sudharani,  Telangana One, Telugu news)


 

By
en-us Political News

  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.