తెలంగాణలో వైఎస్ షర్మిల పరామర్శ సందడి
posted on Oct 9, 2014 12:51PM
.jpg)
జగన్ సోదరి షర్మిల ఇక తెలంగాణలో పరామర్శ యాత్రల పేరుతో ఓదార్పు యాత్రలు చేయబోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఐదేళ్ళు గడిచిన తర్వాత ఆయన మరణ వార్త విని షాక్‌తో చనిపోయారని చెబుతున్న వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని వైకాపా విస్త్రత సమావేశంలో జగన్ ప్రకటించారు. షర్మిలమ్మకు తెలంగాణలో వైసీపీని గ్రామస్ధాయి నుంచి పటిష్టం చేసే బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నారని, వైఎస్ మరణ వార్త విని మనోవేదనతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు షర్మిల పరామర్శ పేరుతో యాత్ర చేపడుతుందని తెలిపారు.