బచ్చా బిలావల్ భుట్టో.. మోడీకి వార్నింగ్...
posted on Oct 9, 2014 12:43PM
.jpg)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ గౌరవాధ్యక్షుడు, పిల్లకాకి బిలావల్ భుట్టో జర్దారీ ఓ హెచ్చరిక చేశాడు. ‘‘పాకిస్థాన్ మీద భారత్ దాడులను చూస్తూ ఊరుకోం. గుజరాత్ బాధితుల మాదిరిగా మేం ప్రతీకారం తీర్చుకోలేమని భావిస్తున్నారా? మేం తప్పనిసరిగా దాడులను తిప్పికొడతాం. ఈ విషయాన్ని నరేంద్రమోడీ తెలుసుకోవాలి’’ అని బిలావల్ భట్టో తన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధికారిక వెబ్ సైట్‌లో పేర్కొన్నారడు. అయితే బిలావల్ భుట్లో మాటల విషయంలో మాత్రం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకులు కట్టుబడి వుండటం లేదు. ఈ వ్యాఖ్యలు బిలావల్ చేసినవి కావని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఈ తరహా పోస్టింగ్స్ చేస్తున్నారని అంటూ తప్పించుకునే ప్రయత్నం, బిలావల్‌ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.