జగన్ కు భారీ షాకిచ్చిన మున్సిపల్ కార్పోరేటర్లు...

 

వైసీపీ పార్టీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీలోకి వలసల పర్వం మళ్లీ మొదలైంది. ముందు ఎమ్మెల్యేలతో మొదలై..ఆ తర్వాత ఎమ్మెల్సీల వరకూ వెళ్లింది. ఇప్పుడు కార్పొరేటర్లు కూడా ఆ దారి పట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది కార్పోరేటర్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. నిన్న కడప నుంచి హైదరాబాదు వచ్చిన 8 మంది కార్పొరేటర్లకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో స్వయంగా కండువాలు కప్పి తన పార్టీలోకి ఆహ్వానం పలికారు. కాగా ఇప్పటికే ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి విదితమే. మరి ఇంకా ఎంతమంది టీడీపీ బాట పడతారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu