సచిన్ టెండూల్కర్ పిటిషన్... కొట్టేసిన కోర్టు..
posted on Jul 19, 2016 11:26AM

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సచిన్ కు భారతరత్న అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీకే నశ్వా అనే వ్యక్తి సచిన్ టెండూల్కర్ భారతరత్న అవార్డును దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ కోర్టులో పిల్ దాఖలు చేశాడు. సచిన్ అవార్డును ప్రకటనలు పొందేందుకు ఉపయోగించుకున్నాడని.. అలాగే కొంతమంది రచయితలు సచిన్ మీద పుస్తకాలు రాశారని, ఆ పుస్తకాలకు భారతరత్న అని పేరు పెట్టుకున్నారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. ఎవరో రచయితలు సచిన్ పై పుస్తకం రాసి దానికి భారత రత్న అని పేరు పెడితే.. దానికి సచిన్ ఎలా బాధ్యులు అవుతారు.. ఇక ప్రకటనల విషయంలో కూడా చర్యలు తీసుకునేందుకు నియమాలేవీ లేవని తెలిపింది.