ఆ టిడిపి ఎమ్మెల్యే పై ఆసక్తికర వ్యాఖ్య చేసిన రోజా

 

 

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో తనను అసెంబ్లీలో ఇబ్బందికి గురి చేసిన టీడీపీ అధినేత మరియు నాయకుల పై తనదైన స్టయిల్లో సెటైర్లు వేస్తున్న రోజా... తాజాగా అసెంబ్లీ లాబీల్లో చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. లాబీల్లో తనకు ఎదురుపడ్డ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరాంను ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.  వైసిపి ఎమ్మెల్యే రోజా అటు వైపు వస్తున్న కరణం బలరాం  రాకను గమనించి... అన్నా మీరు మా వైపు వస్తారని ఆశించాం... కానీ అటు వైపు నుండి వచ్చారు అని కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రోజా వ్యాఖ్యలకు స్పందించకుండా  కరణం బలరాం... నవ్వుతూనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కరణం బలరాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారని  వైసీపీలో చేరతారని  అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన చీరాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి వైసిపి అభ్యర్థి ఆమంచి పై గెలిచారు. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు వైసిపి వైపు చూస్తున్నారన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి  

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu