నరసారావు పేట లో ఆసుపత్రి పై వైసిపి కార్యకర్తల దాడి!!

 

 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత అధికార పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తల పై దాడులు జరుగుతన్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కార్తీక్ ఆసుపత్రిపై  దాడి జరిగింది. డాక్టర్ రమ్య దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. భయభ్రాంతులకు గురైన  రోగులు  ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీసినట్టు సమాచారం. ఈ దాడిలో ఆసుపత్రిలోని ఫర్నీచర్ కూడా ధ్వంసమైంది. తమ ఆసుపత్రిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని, స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే ఈ దాడి జరిగిందని వైద్యురాలు రమ్య ఆరోపించారు. ఎమ్మెల్యే గన్ మన్ సాయంతో వైసీపీ కార్యకర్తలు తమపై దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఆసుపత్రి ఎలా నడుపుతారో చూస్తానని సీఐ బిలాలుద్దీన్ తమను బెదిరించారని డాక్టర్ రమ్య ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu