ఏపీ రాజకీయాల్లో బుక్ వార్

 

ఏపీ రాజకీయాల్లో బుక్ వార్ నడుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు రెడ్ బుక్ తీసుకువచ్చిన నారా లోకేష్.  టీడీపీ కార్యకర్తలను నాటి అధికార వైఎస్సార్సీపీ వేధించిన వైనంపై బాధితుల వివరాల ఆధారంగా రెడ్ బుక్ లో నమోదు చేశారు. నేడు అదే ఒరవడికి తమ పార్టీ తరపున శ్రీకారం చుట్టిన మాజీ సీఎం జగన్. వైసీపీ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేసేందుకు 'డిజిటల్ బుక్' పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించింది

 . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వేధింపులకు గురైన వారు తమ ఫిర్యాదులను digitalbook.weysrcp.com పోర్టల్‌లో గానీ, 040-49171718 ఐవీఆర్ఎస్ నంబర్‌కు ఫోన్ చేసి గానీ నమోదు చేయవచ్చని జగన్ తెలిపారు. ఎవరైనా అధికారి వేధిస్తే, అందుకు సంబంధించిన ఆధారాలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. 

ఏపీలో కక్ష రాజీయాలు ఎక్కువయ్యాయి. ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రతిపక్షల నాయకుల దాడులు చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు తమకనుకూలంగా వ్యవహరించని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రతిపక్షం మాత్రం ఈ దాడులను ప్రజాస్వామ్యంపై దాడులుగా అభివర్ణిస్తోంది. ప్రతి సంఘటనతో రాజకీయ వేడి పెరిగిపోతోంది. 

ప్రజలు మాత్రం అభివృద్ధి పక్కనబెట్టబడి కక్ష రాజకీయాల బలి అవుతున్నారు. దీని వల్ల పెట్టుబటులు రావడం లేదు .. దీనివల్ల రాష్ట్రానికి చెడు పేరు వస్తోంది. పెట్టుబడిదారులు కూడా స్థిరత్వం లేని వాతావరణంలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధి ఆగిపోగా, యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. పరస్పర కక్షలు పక్కనబెట్టి అభివృద్ధి కోసం కలిసి పనిచేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu