బుచ్చయ్య తాతా.. అసెంబ్లీలో లోకేష్ సరదా సంబోధన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ప్రజాసమస్యలపై చర్చతో పాటు సరదా మాటలు కూడా పేలుతున్నాయి. మండలిలో వైసీపీ, తెలుగుదేశం సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. అసెంబ్లీలో.. అధికారపక్ష సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు. మంత్రులను, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ప్రజాగొంతుకు వినిపించడంలో తెలుగుదేశం కూటమి సభ్యులు ఏ మాత్రం వెనుకాడటం లేదు.  ఈ నేపథ్యంలోనే బుధవారం అసెంబ్లీలో ఓ సరదా సంభాషణ జరిగింది. తెలుగుదేశం సీనియర్ సభ్యుడు  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏళ్లతరబడి  ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యత లేని యూనిఫాంలు, బెల్టులు లభిస్తున్నాయన్నారు.

అయితే  ప్రస్తతం విద్యా మంత్రి నారా లోకేష్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశారనీ అభినందించారు.  ఇప్పడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నాణ్యత ఉన్న యూనిఫారాలు, బెల్టులు అందాయన్నారు.  ఇది తన విధుల పట్ల లోకేష్ కు ఉన్న బాధ్యతకు నిదర్శనమని అభినందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆప్యాయంగా బుచ్చయ్య తాత అని సంబోధించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.. లోకేష్ ను వారిస్తూ తాతా అని కాకుండా అంకుల్ అని సంబోధిస్తే బాగుంటుందేమో అన్నారు. దీనిపై లోకేష్  ఎన్టీఆర్ హయాం నుంచి బుచ్చయ్య ఉన్నారనీ, ఆయనంటే తనకు గౌరవమనీ చెప్పారు. తాను ఆయనను చిన్నప్పటి నుంచీ తాత అనే పిలుస్తున్నానన్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu