జగన్ తుఫాన్ విరాళం 50 లక్షలు
posted on Oct 16, 2014 9:26AM
.jpg)
హుదుద్ తుఫాను బాధితుల సహాయార్థం వైసీపీ అధ్యక్షుడు జగన్ 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే వికాస తరంగిణి సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల విరాళాన్ని అందజేసింది. 3,11,116 విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి యోగివేమన విశ్వవిద్యాలయం అందించింది. తుఫాన్ బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ రంగంలోకి దిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తుఫాను బాధితుల కోసం రోజూ 10 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా లోకేష్ పర్యవేక్షణలో మరో ఐదు రోజుల పాటు ఈ శిబిరాలు నిర్వహిస్తారు. తుఫాను బాధితులకు వైద్యసేవలు అందించేందుకు యశోద ఆస్పత్రుల వైద్య బృందం బుధవారం నాడు విశాఖపట్నం బయలుదేరింది. ఐదుగురు వైద్యులతోపాటు ఆరుగురు మెడికల్ టెక్నీషియన్ల బృందం ఈసీజీ, అల్ట్రా సౌండ్, ఆక్సిజన్, వెంటిలేటర్‌లు, ఇతర అత్యవసర మందులు తీసుకొని విశాఖకు వెళ్ళారు.