వేలెడంత లేరు.. వీళ్ళకి లవ్వు.. ఆత్మహత్యాయత్నం...
posted on Oct 15, 2014 10:32PM

బాపట్లలో నలుగురు మైనర్లు ఒకేసారి కలసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నలుగురూ రెండు జంటలు. బాపట్లకు చెందిన ప్రత్యూష, దుర్గ అనే ఇద్దరు మైనర్ బాలికలు ఇంటర్ చదువుతున్నారు. అలాగే, గోపిరెడ్డి ఇంటర్ చదువుతుండగా, శివసత్యనారాయణ ఆవారాగా తిరుగుతూ వుంటాడు. ఈ నలుగురూ ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరన్న ఆలోచనతో నలుగురూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో నలుగురూ కలిసి విషం తాగారు. దీనిని గమనించిన స్థానికులు 108 వాహనాన్ని పిలిచి అపస్మారక స్థితిలో వున్న ఈ నలుగురినీ బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప్రత్యూష, దుర్గ పరిస్థితి చాలా విషమంగా ఉంది.