వైసీపీకి మరో చిల్లు!

 

 

 

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దాదాపు ఖాళీ అయిపోయింది. ఒకరిద్దరు నాయకులు మాత్రమే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనిన భయపడుతూ వైసీపీలో వున్నారే తప్ప, ఇంకా వైసీపీలో కొనసాగడానికి వాళ్ళకి మరో కారణం కనిపించడం లేదు. సందు దొరికితే అర్జెంటుగా జంప్ జిలానీ అవతారం ఎత్తడానికి వాళ్ళందరూ సిద్ధంగా వున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో చిల్లుల జల్లెడలా మారిన వైసీపీ పడవకి మరో పెద్ద చిల్లు పడింది. ఇంతకాలం తెలంగాణలో వైసీపికి అండగా వుండి, వైసీపీని, జగన్‌ని తన భుజాల మీద మోసిన బాజిరెడ్డి గోవర్దన్ గురువారం నాడు వైసీపీకి గుడ్ బై చెప్పేశాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీ నుంచి కీలక నాయకుడు బయటకి వెళ్ళిపోవడం వైసీపీకి తెలంగాణలో పూర్తిగా గల్లంతు అవడానికి సూచనగా భావించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో వైసీపీకి చెట్టులాంటి బాజిరెడ్డి గోవర్దన్ పార్టీలోంచి బయటకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన చిన్నా చితకా మొక్కల్లాంటి నాయకులు జంప్ కావడం ఎంతసేపు?