పోస్టర్ పాలిటిక్స్!

 

 

 

నరేంద్రమోడీ పార్లమెంట్‌కి పోటీ చేస్తున్న గుజరాత్‌లోని వడోదరలో వాల్ పోస్టర్ల పాలిటిక్స్ ముదిరి పాకాన పడ్డాయి. ఈ నియోజవర్గంలో నరేంద్రమోడీ మీద కాంగ్రెస్ అభ్యర్థిగా మధుసూదన్ మిస్రీ పోటీ చేస్తున్నాడు. ఊళ్ళో ఎక్కడ చూసినా నరేంద్రమోడీ పోస్టర్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నాయి.

 

తాను కూడా మోడీ రేంజ్‌లో పబ్లిసిటీ చేయాలంటే హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టే ప్లేస్ లేదనీ, వాటన్నిటినీ నరేంద్రమోడీ బ్యాచ్ నెల రోజుల క్రితమే బుక్ చేసేసుకుందని తెలిసింది. దాంతో బాగా ఆలోచించిన ఆయన గారికి ఒక థర్డ్ క్లాస్ ఐడియా వచ్చింది. అదేంటంటే, వడోదరలో నరేంద్రమోడీ పోస్టర్ ఎక్కడ కనిపిస్తే ఆ పోస్టర్ మీద తన పోస్టర్ అతికించేయాలి. అప్పుడు నరేంద్రమోడీకి పబ్లిసిటీ తగ్గిపోయి, తనకి పబ్లిసిటీ వస్తుంది. ఈ దిక్కుమాలిన ఐడియా రాగానే మధుసూదన్ మిస్రీ దాన్ని అమలులో పెట్టేశాడు.



గురువారం ఉదయం తెల్లారగానే ఈ పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టాడు. ఎక్కడ నరేంద్రమోడీ ఫొటో కనిపిస్తే అక్కడ తన ఫొటో వున్న వాల్ పోస్టర్ అతికిచండం మొదలెట్టేశాడు. దీనిన గమనించిన పోలీసులు మధుసూదన్ మిస్రీని, ఆయన వాల్‌పోస్టర్, మైదా బ్యాచ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయినా రామాయణంలో పిడకల వేటలా ఈ కటౌట్ల గొడవేంటో. అయినా కంటెంట్ వున్న తనకి కటౌట్ అవసరం లేదని మోడీ అర్థం చేసుకోలేదు. కంటెంట్ లేని తనకి కటౌట్లు పెట్టినా ఉపయోగం లేదని మధుసూదన్ మిస్రీ అర్థం చేసుకోలేదు. అక్కడొచ్చింది తంటా.