రేపు మండల కేంద్రాల్లో వైకాపా దీక్షలు, ధర్నాలు

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా 663 మండల కేంద్రాలలో ధర్నాలు చేప్పట్టబోతోంది. అధికారం చేప్పట్టి ఐదు నెలలు కావస్తున్నా ఇంతవరకు డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ చేయకపోవడాన్ని నిరసనగా ఈ ధర్నాలు నిర్వహించ బోతున్నారు. అదేవిధంగా ఈ ధర్నాలలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలలో హూద్ హూద్ తుఫాను సహాయ కార్యక్రమాలు చెప్పట్టడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, తక్షణమే తుఫాను పీడిత ప్రాంతాలలో సహాయ కార్యమాలు చేప్పట్టాలని డిమాండ్ చేయబోతున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జనవరి ఆరు మరియు ఏడు తేదీలలో తను స్వయంగా గోదావరి జిల్లాలో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu