ప్రభుత్వంపై భారం లేకుండా మెట్రో రైల్

ఏపీ ప్రభుత్వం పై భారం పడకుండా మెట్రో ప్రాజెక్టు చేపడుతామని మెట్రో నిపుణుడు శ్రీధరన్ తెలిపారు. మంగళవారం శ్రీధరన్ విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖలో 30 కి.మీ., విజయవాడలో 27 కి.మీ.లో మెట్రో రైలు నిర్మాణం చేపడతామన్నారు. ఆరు నెలల్లో డీసీఆర్ ప్రాజెక్టు సిద్ధం చేస్తామని చెప్పారు. విపత్తులను తట్టుకునేలా ప్రాజెక్టు నిర్మాణం చేపడతామన్నారు. విజయవాడ , విశాఖలలో ఒకేసారి మెట్రో ప్రారంభం కావచ్చని ఆయన అన్నారు. ముందుగా సర్వే జరుగుతుందని,మూడు నెలల్లో సర్వే పూర్తి అయ్యాక,నిర్మాణం ఆరంభం అవుతుందని అన్నారు. మెట్రో నిజంగానే ప్రభుత్వానికి భారం లేకుండా చేయగలిగితే ఉపయుకక్తంగా ఉంటుందని చెప్పాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu