వైసీపీకి భయమా...బెదురా? షర్మిల సంచలన ట్వీట్
posted on Sep 12, 2025 8:16PM
.webp)
నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే..? ఇది భయమా ? బెదురా ? వాళ్ళకే తెలియాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు
రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా వైఎస్‌ఆర్ నామకరణం చేశారు. నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు. సీఎం చంద్రబాబు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని తీసుకువస్తే..మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్‌ఎస్ఎస్ వాదికి మద్దతు ఇచ్చారు? వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా బీజేపీ అభ్యర్థికి జగన్ మద్దతు ఇవ్వడం అవమానకరమని షర్మిల ట్వీట్ చేశారు.
అదానీ, రిలయన్స్ వ్యవహారాలను ప్రస్తావిస్తూ షర్మిల విమర్శలు గుప్పించారు. “వైఎస్సార్ మరణం వెనుక రిలయన్స్ కుట్ర ఉందని జగన్ చెప్పాడు. కానీ అదే రిలయన్స్ వారికి రాజ్యసభ సీటు ఇచ్చాడు. అదానీ కోసం గంగవరం పోర్ట్‌ను త్యాగం చేశాడు.
ఐదు ఏళ్ల అధికారంలో బీజేపీ ప్రతీ బిల్లుకు జగన్ మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు ఏ ముఖంతో ఈ మద్దతు ఇస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలి,” అని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నిశ్శబ్దంగా ఉండగా, వైసీపీ మాత్రం బీజేపీకి ఓటు వేసిందని ఆమె మండిపడ్డారు. టీడీపీ-జనసేన పొత్తు బహిరంగమని, కానీ జగన్ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని షర్మిల ఆరోపించారు.