ఓలీ.. నీ దుంపతెగ...ఎంత పని చేశావు
posted on Sep 13, 2025 1:13PM

నేపాల్ ఇంతగా ఎందుకు తగలబడుతోంది? ఇక్కడి యువత మోడీలాంటి ప్రధాన మంత్రి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అని చూస్తే ఓలీ నుంచి వచ్చిన డైరెక్ట్ కామెంట్.. నేను మీ భారత దేశ ఆరాధ్య దైవం, అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రుడి ఉనికి ప్రశ్నార్ధకం చేసేలా కామెంట్లు చేశాను. అదే నా కొంప ముంచిందని అన్నారు ఓలి.
నిజానికి ఓలీ ఇప్పటి వరకూ రెండు మార్లు జానకీ మాత మాత్రమే కాదు రాముడు సైతం మా దేశంలోనే పుట్టాడని అన్నారు. దీంతో అక్కడి పురావస్తు శాఖ ఇది నిరూపించడానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. మాములుగా అయితే అది జానకీ మాత జన్మించిన నేల. తన భర్త అంటే ఆమెకు అంత ప్రేమ. అలాంటి తన పతిదేవుడి ఉనికి ప్రశ్నార్ధకం చేస్తే ఊరుకుంటుందా? ఆగ్రహిస్తుంది. సత్యం బయటకు రావడానికి తానెలా అగ్ని పునీత అయ్యిందో.. సరిగ్గా అలాగే తాను జన్మించిన దేశాన్ని కూడా అగ్ని పునీతం చేసింది. అప్పుడుగానీ ఓలీ తాను ఆనాడు అన్న మాటలు నిజం కావని ఓప్పుకోలేదు.
రాముడికి నిజంగానే అంత పవరుందా? ఆయన్ను అన్న వారు ఇలా నామరూపాల్లేకుండా నాశనమై పోతారా? అంటే ప్రస్తుతానికైతే అదే నిజమని నిరూపితమవుతోంది. రామ జన్మ భూమి అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 5 లక్షల మంది వరకూ మరణించి ఉండవచ్చని ఒక అంచనా.
మొత్తానికి రామజన్మభూమి అన్యాక్రాంతమైన 500 ఏళ్లకు ఇప్పుడు ఇక్కడ బాలరామ ఆలయం వెలసింది. ఎవరైతే రామజన్మ భూమి అనే ఒకానొక ఉద్యమం మొదలు పెట్టారో.. వారు ప్రస్తుతం దేశాన్ని అప్రతిహతంగా ఏలుతున్నారు.
అంటే రాముడు లేడని అన్న వారు ఎలా నాశనమై పోతారో.. సరిగ్గా రాముడున్నాడు, ఆయన పుట్టుక నిజం.. ఆయన పయనం నిజం.. అంతకన్నా మించి ఆయన అయోధ్యలో జన్మించింది నిజం.. అన్న వారిని అందలం ఎక్కిస్తారు. అదే ఆయన ఉనికినే ప్రశ్నార్ధకం చేసిన వారి అంతు చూస్తాడా శ్రీరామచంద్రుడు. ఈ విషయం మరోమారు నేపాల్ ఉదంతంతో రుజువైందని అంటున్నారు చాలా మంది.
ఈ మాట స్వయంగా కేపీశర్మ ఓలీ అనడంతో మళ్లీ రాముడు కేవలం పౌరాణిక పాత్ర కాదు. అదొక చారిత్రక పాత్ర. ఆయన చరిత్ర నిజం. ఆయన అయోధ్య కేంద్రంగా పాలించింది నిజం. ఆయన పితృవాక్ పాలన నిజం ఆయన ఏకపత్నీ వ్రతం నిజం ఆయన మాటకోసం నిలబడ్డం నిజం. మొత్తంగా శ్రీరాముడు ఒక ధర్మానికి ప్రతీక అన్న మాట నిజం అని మరోమారు రుజువైందని అంటున్నారు శ్రీరామ భక్తులు.