జగన్ దీక్ష.. ఎవరికి ప్లస్?.. ఎవరికి మైనస్?

 

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ గుంటూరు దగ్గర నల్లపాటులో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ ఈ దీక్షను చేపట్టి నాలుగురోజులు కావస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన చాలా నీరసించినట్టుగా స్పష్టంగా తెలస్తోంది. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. జగన్ బాగా నీరసించిపోయారని.. ఆయన పల్స్ రేట్ గంట గంటకు తగ్గిపోతుందని చెప్పారు. దీంతో ఎలాగొలా జగన్ తో ఈరోజు దీక్ష విరమింపచేయాలని.. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిచాలని చూస్తున్నట్టు పార్టీనేతలు తెలుపుతున్నారు.

అయితే ఒకపక్క జగన్ దీక్ష చేస్తుంటే మరో పక్క అధికార పార్టీ నేతలు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే జగన్ దీక్ష ప్రారంభించిన రెండు రోజులు విమర్సలు చేసినా ఇప్పుడు కాస్త తగ్గిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో జగన్ పై విమర్శలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయని అనుకున్నారేమో కాని జగన్ దీక్షపై ఫోకస్ చేయడం తగ్గించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అసలు ఏం జరగడంలేదు అన్నట్టు వ్యవహరిస్తూ తన బిజీలో తాను ఉన్నారు.

అయితే ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే.. ఒకవేళ జగన్ కనుక దీక్షను విరమిస్తే సరే.. లేకపోతే దీక్షను అలాగే కొనసాగిస్తే ఏపీ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన అంశంమే. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక  హోదా గురించి దీక్ష చేస్తున్న జగన్ ఇప్పటికే నీరసించిపోయారు.. ఈ నేపథ్యంలో ఆయనతో దీక్ష విరమింపచేయాలంటే ప్రత్యేక హోదా గురించి అటు కేంద్ర ప్రభుత్వం కాని.. ఇటు ఏపీ ప్రభుత్వం కాని ఏదో ఒకటి తేల్చి చెప్పాలి. ఒకవేళ దీక్ష విరమించకపోయినా కూడా పరిస్థితి బాలేదు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక వేళ జగన్ దీక్షకు ఫలితంగా ప్రత్యేక హోదాపై అనుకూల స్పందన వచ్చినట్టయితే జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్టే. ఈ రకంగా జగన్ పై ప్రజలకు కాస్తంత నమ్మకం కలుగుతుంది. ఓ రకంగా ఇది అధికార పార్టీకి మైనస్ పాయింట్ కూడా కావచ్చు. మరి ఈ దీక్ష జగన్ కు ప్లస్ పాయింట్ అవుతుందా.. లేక అధికార పార్టీకి మైనస్ పాయింట్ అవుతుందా తెలియాలంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu