మోడీ నిరాశపరిచారు.. ఆందోళనలు చేపడతాం.. జగన్
posted on Oct 23, 2015 10:56AM

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ 5 కోట్ల ఆంధ్రా ప్రజలను నిరాశపరిచారని వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ ఏపీ ప్రత్యేక హోదా గురించి కానీ, ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ ఎటువంటి హామీ ఇవ్వకపోవడాన్ని జగన్ తప్పు పట్టారు. ప్రధాని మోడీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశించారని, అయితే హోదాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు నిరాశ చెందారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మోడీ వస్తారు.. ఏదో ఒక ప్రకటన చేస్తారు అని ఆశించిన ఏపీ ప్రజలకు.. ఢిల్లీ నుండి మట్టి తీసుకొచ్చి చేతిలో పెట్టారని ఎద్దేవ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి తెలుగు ప్రజలను మోసం చేశారని.. వారికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.