మహిళలను కించపరిచే వ్యక్తికి పరామర్శ సిగ్గు చేటు : ప్రశాంతి రెడ్డి

 

వైసీపీ  అధినేత జగన్ నెల్లూరు పర్యటనపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు నగరం మాగుంట లే ఔట్ లోని నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై  నిప్పులు చెరిగారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి నిజాయతీగా వ్యాపారాలు చేసే ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని విమర్శిస్తావా అంటూ సూటిగా ప్రశ్నించారు. మహిళలను కించపరుస్తూ సంస్కార రహిత వాఖ్యలు చేసిన ప్రసన్నలాంటి వారిని పరామర్శించి సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 

తీర్ధయాత్రలు చూసాం, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు లాంటివి కూడా చూసాం ఈ జైలు యాత్రాలేంటి ఆమె అన్నారు.మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని  జగన్ మోహన్ రెడ్డి పరామర్శించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని, చెల్లినీ వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగమని ఈ సందర్భంగా ఆమె అభివర్ణించారు. 

జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అస్యహించుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లని సమర్ధించడం నాయకుడి లక్షణం కాదన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం ద్వారా వైఎస్ జగన్ తన స్థాయి దిగజార్చుకున్నారని ఆమె అన్నారు. రూ.500కోట్లతో ఫ్యాక్టరీ పెట్టి గ్రామీణ యువతకి ఉపాధి కల్పించాలన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ఆశయానికి కొందరు నీచులు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వైసీపీ నేతలు అనిల్, ప్రసన్న లాంటి అచ్చోసిన ఆంబోతుల వల్లే జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందన్నారు. అందుకే ప్రజలు   11 సీట్లకి పరిమితం చేసినా, ఆ పార్టీ నేతల బుద్ధి మాత్రం మారడం లేదని వాపోయారు. మీ తల్లో, చెల్లో, ఆవిడో రాజకీయాల్లోకి వస్తే.. వాళ్లపై ప్రత్యర్థులు మీలా నోరుపారేసుకుంటే ఊరుకుంటారా? అంటూ వైసీపీ అగ్రనేతలను ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu