రాజారెడ్డి రాజ‌కీయ అరంగేట్రం

 

ఎవ‌డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనేది పోకిరి డైలాగ్. అలాంటి పోరికీ డైలాగ్ క‌న్నా మించిన దృశ్యం ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అదే వైయ‌స్ రాజారెడ్డి పొలిటిక‌ల్ ఎంట్రీ. ఎవ‌రీ రాజారెడ్డి.. ఏమా అంరంగేట్రం క‌థ‌.. క‌మామిషు అంటే..

రాజారెడ్డి మ‌రెవ‌రో కాదు, వైఎస్ ష‌ర్మిళ‌- అనిల్ కుమారుడు. ప్ర‌స్తుతం వైఎస్ ఫ్యామిలీలో జ‌గ‌న్ షర్మిళ‌గా రెండుగా చీలిన దృశ్యం చూస్తూనే ఉన్నాం. త‌న అన్న‌తో వేరు ప‌డ్డ ష‌ర్మిళ మొద‌ట వైయ‌స్ఆర్టీపీ అనే పార్టీని తెలంగాణ‌లో స్థాపించిన.. ఆ త‌ర్వాత త‌మ మాతృ పార్టీ కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేసి అటు పిమ్మ‌ట 2024 ఎన్నిక‌ల్లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఎంట్రీ ఇచ్చారామె.

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో అన్న‌కు గంట‌కు గుక్కెడు నీళ్లు తాగిస్తున్న ష‌ర్మిళ, త‌న డోస్ స‌రిపోవ‌డం లేద‌ని కొత్త‌గా ఓ ఆర‌డుగులు బుల్లెట్ ని త‌న అన్న గుండెల్లోకి నేరుగా దింపాల‌ని ట్రై చేస్తోంది. ఆ బుల్లెట్ పేరే వైయ‌స్ రాజారారెడ్డి జూనియ‌ర్.

ఎస్. ఈ జూనియ‌ర్ రాజారెడ్డి దెబ్బ‌కు వైయ‌స్ జగ‌న్ కాకీ ఫ్యాంట్ త‌డిసిపోతోంద‌ట‌.. ఇటు భార‌తీరెడ్డి సైతం.. త‌న ప్ర‌య‌త్నాల‌న్నిటినీ తిప్పి కొట్ట‌డానికి వ‌స్తోన్న ఈ రాజారెడ్డి జూనియ‌ర్‌ను చూసి త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌. కార‌ణ‌మేంటంటే.. జ‌గ‌న్ ద్వారా వైఎస్ ఫ్యామిలీ లెగ‌సీని మామ భాస్క‌ర్ రెడ్డి, బావ అవినాష్ తో క‌ల‌సి ఇటు వైపు తిప్పుకునే య‌త్నం చేస్తున్న భారతీరెడ్డికి రాజారెడ్డి అనే పేరుగ‌ల ఈ బుల్లెట్ లాంటి కుర్రోడు త‌ల్లి నీడ‌లో రాజ‌కీయంగా ఎదిగేందుకు అడుగుల వేస్తున్న దృశ్యం తెగ క‌ల‌వ‌ర పెడుతోంద‌ట‌.

ఇప్ప‌టికే రాజారెడ్డిలో ఇటు బ్రాహ్మ‌ణ‌, అటు రెడ్డితో పాటు భార్య ద్వారా క‌మ్మ ర‌క్తం కూడా క‌ల‌గ‌ల‌సి ఉండ‌టంతో ఇతడు మూడుర‌క్తాల ముద్దుల బుల్లెట్ గా పేరు సాధిస్తున్నాడు. ఆపై రాన్రాను త‌ల్లి వెంట తిరిగి ఇక్క‌డి రాజ‌కీయాల‌కు అల‌వాటు ప‌డితే క‌ష్ట‌మే అన్న‌ది తాడేప‌ల్లి ప్యాలెస్ టాక్ గా తెలుస్తోంది.

ఇప్ప‌టికే లోకేష్, ప‌వ‌న్ రూపంలో తీవ్ర రాజ‌కీయ అంత‌రాయం ఎదుర్కుంటోన్న జ‌గ‌న్ వ‌చ్చే రోజుల్లో త‌న‌కు సాటి రాగ‌ల రాజారెడ్డి కూడా ఎంట్రీ ఇస్తే.. ఆయ‌న పాతికేళ్ల ఆశ‌లు ఆవిర‌యిన‌ట్టుగానే ఫీల‌వుతున్నట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం త‌ల్లితో క‌ల‌సి.. రాజారెడ్డి క‌ర్నులు ఉల్లి యార్డు ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌బోతూ అమ్మ‌మ్మ విజ‌య‌మ్మ ఆశీర్వాదం తీస్కుంటున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయ్. రాజారెడ్డి రాజకీయ ఆరంగేట్రం త్వరలో ఉంటుందని షర్మిల ప్రకటన..వ‌చ్చే రోజుల్లో రాజారెడ్డి రాజ‌కీయంగా మ‌రింత రాటు దేలితే.. ఇక జ‌గ‌న్ కి మేన‌మామ‌గండం ఉన్న‌ట్టే అని భావిస్తున్నారు.

అల‌నాడు శ్రీకృష్ణుడు త‌న మేన‌మామ కంసుడ్ని ఏ విధంగా తుద‌ముట్టించాడో.. ఈ జ‌గ‌న్ మామ‌ను రాజారెడ్డి అనే మేన‌ల్లుడు కూడా స‌రిగ్గా అలాగే రాజ‌కీయంగా నామ‌ రూపాల్లేకుండా చేస్తారా? అన్న ఉత్కంఠ చెల‌రేగుతోంది. 

ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబును ముస‌లోడు ముస‌లోడంటోన్న జ‌గ‌న్.. లోకేష్- ప‌వ‌న్- రాజారెడ్డి త్ర‌యం ముందు ముస‌లోడు కాక త‌ప్ప‌దు. ఆపై మూల‌కు చేర‌కా త‌ప్ప‌ద‌న్న కామెంట్లు సైతం సామాజిక మాధ్య‌మాల్లో పేలుతున్నాయంటే ప‌రిస్థితేంటో అర్ధం చేసుకోవ‌చ్చు. మ‌రి చూడాలి జ‌గ‌న్ మామ రాజ‌కీయ ముఖ‌చిత్ర‌మేంటో అన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయ్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu