వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డికి.. 41ఏ నోటీసులు

 

తెలుగు దేశం పార్టీ నేత విశ్వనాథరెడ్డిని ఇటీవల ఫోన్‌లో బెదిరించిన కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి కడప జిల్లా పులివెందుల పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. కడప జిల్లా పులివెందుల మండలం చెందిన విశ్వనాథరెడ్డి..తాజగా పులివెందుల టీడీపీ ఇంఛార్జీ బీటెక్‌ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. 

ఈ నేపథ్యంలో భాస్కర్‌రెడ్డి, శివశింకర్‌రెడ్డి, లోక్ సభ్యుడు అవినాశ్‌రెడ్డి సమక్షంలో పీఏ రాఘవరెడ్డి, అదే గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి తదితరులు తీవ్రస్ధాయిలో బెదిరించినట్లు ఫోన్‌కాల్ డేటా ఆధారాలను విశ్వనాథ్‌రెడ్డి పులివెందుల పోలీసులకు అందజేశారు. వీరందరిపై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. అయితే వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్‌రెడ్డి, వివేనందరెడ్డి హైదరాబాద్‌లో ఉండాలని కండిషన్ బెయిల్ ఉన్నాందున పులివెందుల పోలీసులు అక్కడికి వెళ్లి 41 ఏ నోటీసులు అందజేశారు . 

 వివేక హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఆమె ప్రశ్నించారు. పులివెందులలోని వివేకా ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని మర్డర్ చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారికి ఇంకెప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు న్యాయపోరాటం చేయాలని  సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu