డీలిమిటేషన్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

 

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలన్నా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ ఉంటుందన్న సర్వోన్నత న్యాయస్థానం చట్టంలో ఇది స్పష్టంగా ఉందని వెల్లడించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని సుప్రీంకోర్టును  ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. 

రాజ్యాంగంలోని 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. 2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించ‌డం వ‌ల్ల‌ మిగతా రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాల‌తో పోల్చిన‌ప్పుడు రాష్ట్రాల‌లో డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధ‌న‌లు భిన్నంగా ఉంటాయ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్నాది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu