ఎలాంటి ఏర్పాట్లు వద్దు...నేల మీదే కూర్చుంట..!
posted on Jun 3, 2017 6:23PM
.jpg)
ఈ మధ్య ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యానాధ్ పలు విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అలాంటి విమర్శలకు తావివ్వకూడదని అనుకున్నారేమో కానీ రాష్ట్రంలో పర్యటనలు, తనిఖీలు, పథకాల ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు తన కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీచేశారట. 'నాగురించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దు. మామూలు నేల మీద కూర్చునే వ్యక్తుల్లో నేను ఒకడిని' అని సీఎం యోగి అన్నారట.
కాగా ఇటీవల అమరుడైన ఓ బీఎస్‌ఎఫ్ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం యోగి వెళ్లిన సందర్భంగా ఆయన ఇంటిలో ఏసీ, సోఫా, కార్పెట్‌లను అధికారులు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. యోగి ఎక్కడికి వెళ్లినా ఇదేవిధంగా అధికారులు విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆ విమర్శలకు బ్రేక్ వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు.