లండన్‌లో ఉగ్రవాదుల మారణహోమం

బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. నగరంలోని రెండు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించారు. ఓ వంతెనపై నడుస్తున్నపాదచారులను ఉగ్రవాదులు వ్యాన్‌తో ఢీకొట్టడంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. ఇదిలా ఉండగానే లండన్‌లోని బోరోహ్ మార్కెట్‌లో మరికొందరు ఉగ్రవాదులు కత్తులతో ప్రజలపై దాడికి దిగారు. కనిపించిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu