మరో 25 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి.. టెన్షన్ లో వైసీపీ
posted on Apr 23, 2016 11:46AM
.jpg)
వైసీపీ నుండి ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా టీడీపీలోకి చేరుతున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వల్ల వైసీపీ విలవిల్లాడుతుండగా ఇప్పుడు టీడీపీ నేతలు మరో ప్రచారాస్త్రాన్ని విసిరారు. మరో 25 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని.. ఆ ఎమ్మెల్యేలతో చేసిన చర్చలు ఫలించాయని అంటున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది.
కాగా అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా మరికాసేపట్లో టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆయన మరికాసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో భేటీ కానున్నారు. వెనువెంటనే ఆయన టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.