రేట్లు పెంచేసి బాబు డబ్బులు దండుకున్నారు..జగన్
posted on Apr 23, 2016 11:55AM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాంపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి గాను ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. భేటీ ముగిసిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో పరిస్థితుల గురించి గవర్నర్ కు వివరించామని.. పట్టపగలే ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.. ఏపీలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది.. అవినీతి డబ్బుతో సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను రూ.. ఇరవై కోట్లు.. ముఫ్పై కోట్లకి కొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు జీవో 22 ద్వారా రేట్లు పెంచేసి డబ్బు దండుకున్నారు.. పట్టిసీమ ప్రాజెక్టుతో ప్రభుత్వం డబ్బు దండుకుంది.. అమరావతిలో బినామి పేర్ల మీద చంద్రబాబు ఆస్తులు కొన్నారని విమర్శించారు.