నాకు ప్రాణహాని వుంది.. భద్రత తగ్గించొద్దు.. జగన్...
posted on Sep 16, 2014 1:01PM
.jpg)
తనకు ప్రాణహాని వున్నందువల్ల తనకు భద్రత తగ్గించవద్దని వైసీపీ నాయకుడు జగన్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం తనకు వున్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. గత మూడు సంవత్సరాల నుంచి తనకు కొనసాగుతూ వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతను యథాతథంగా కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తన పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కడప జిల్లా ఎస్‌పీ, రాష్ట్రస్థాయి భద్రత సమీక్ష కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.